Heroines : టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ వీళ్లే..!

Heroines : సినిమా ఇండస్ట్రీ గ్లామర్ వరల్డ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ వరల్డ్ అన్న పదం ముఖ్యంగా హీరోయిన్స్‌కు వర్తిస్తుంటుంది. అందం ప్లస్ అభినయం ఉన్న అమ్మాయిలు మాత్రమే హీరోయిన్స్‌గా కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారని సినీ పెద్దలు చెప్తుంటారు. ఇకపోతే ప్రజెంట్ టాలీవుడ్ హీరోయిన్స్ హవా నడుస్తున్నది. టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయంలో ఒకప్పుడు హీరోలు తీసుకున్నంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది అనతి కాలంలోనే […].

By: jyothi

Published Date - Wed - 3 November 21

Heroines : టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ వీళ్లే..!

Heroines : సినిమా ఇండస్ట్రీ గ్లామర్ వరల్డ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ వరల్డ్ అన్న పదం ముఖ్యంగా హీరోయిన్స్‌కు వర్తిస్తుంటుంది. అందం ప్లస్ అభినయం ఉన్న అమ్మాయిలు మాత్రమే హీరోయిన్స్‌గా కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారని సినీ పెద్దలు చెప్తుంటారు. ఇకపోతే ప్రజెంట్ టాలీవుడ్ హీరోయిన్స్ హవా నడుస్తున్నది. టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయంలో ఒకప్పుడు హీరోలు తీసుకున్నంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Heroines 4

Heroines 4

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది అనతి కాలంలోనే బాగా పాపులర్ అయ్యారు. ఇక్కడ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇతర ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడా సత్తా చాటుతున్నారు. అందాల ముద్దుగుమ్మలు సినిమా టు సినిమా తమ స్థాయిని పెంచుకోవడం‌తో పాటు రెమ్యునరేషన్ పెంచేసుకుంటున్నారు. మూడు పదులు దాటిన ఈ భామలో టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. వారు ఎవరెవరంటే..

Heroines 3

Heroines 3

దీపమున్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న మాదిరిగా హీరోయిన్స్ తమ కెరీర్ తొలినాళ్లలోనే బాగా సంపాదించేస్తున్నారు. తమకు డిమాండ్ ఉందని తెలుసుకుని రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుంటున్నారు. సినిమా టు సినిమా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు కూడా. టాలీవుడ్ స్వీటీ అనుష్కషెట్టి ఒక్కో సినిమాకు రూ. 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమచారం.

Heroines

Heroines

టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్ వెళ్లిన క్యూట్ బ్యూటీ రష్మిక మందన ఒక్క సినిమాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక సినిమాకు రూ.3.5 కోట్ల వరకు తీసుకుంటుంది. ఇక టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే, సమంత మాత్రం తన రెమ్యునరేషన్ సినిమాను బట్టి నిర్ణయిస్తుందని సమాచారం.

Heroines 1

Heroines 1

సుమారుగా ఒక్కో సినిమాకు సమంత కూడా రూ.3.5 కోట్ల పారితోషికం తీసుకుంటుందని వినికిడి. అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒక్క సినిమాకు రూ.2 కోట్లు తీసుకుంటుండగా, మిల్కీ బ్యూటి తమన్నా భాటియా 1.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నదట. ఇకపోతే ఒకే ఒక సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఉప్పెన’హీరోయిన్ కృతిశెట్టి ఒక్క సినిమాకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నదని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

Heroines 2

Heroines 2

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క సినిమాకు రూ.2 కోట్లు తీసుకుంటుందట. అయితే, హీరోయిన్స్ చాలా మంది సినిమాతో పాటు ఇతర యాక్టివిటీస్‌లో పాల్గొంటూ సంపాదిస్తున్నారు. షాపింగ్ మాల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉంటున్నారు. వాటి తరఫున ప్రచారం కూడా చేస్తున్నారు. అలా తమ సెలబ్రిటీ స్టేటస్‌ను బ్రాండ్ ప్రమోషన్స్‌కు యూజ్ చేసి రెండు చేతులా సంపాదించేస్తున్నారు.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News