Heroines :వీళ్ళు వాళ్ళకి హ్యాండిచ్చారా.? వాళ్ళు వీళ్ళకు హ్యాండిచ్చారా.? ఏమోగానీ, హీరోయిన్ల విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ వుండడం సహజమే కదా. అదే సమయంలో, హీరోయిన్ల మీద వచ్చే నెగెటివ్ వార్తలకి క్రేజ్ ఎక్కువ. దాంతో, కిలేడీలు.. పాపం, అమాయకులైన మగాళ్ళని మోసం చేశారనే ప్రచారం సర్వసాధారణంగానే జరుగుతుంటుంది. తెరవెనుకాల ఏం జరిగిందనేది పక్కన పెడితే, పెళ్ళి పీటలదాకా వెళ్ళిన కొందరు తారల వ్యవహారాలు, అనూహ్యంగా బెడిసికొట్టాయి. ఆ లిస్టులోని కొందరు అందాల భామలు, వాళ్ళ ప్రేమకథలు, బెడిసికొట్టిన.. పెళ్ళిక ముందు వ్యవహారాల గురించి తెలుసుకుందాం..
త్రిష :
heroines cancelling marriages -Trisha
హీరోయిన్ త్రిషకి కొన్నాళ్ళ క్రితం వరుణ్ మనియణ్ అనే వ్యాపార వేత్తతో నిశ్చితార్థం కూడా జరిగింది. ఏమయ్యిందోగానీ, అనూహ్యంగా త్రిష, పెళ్ళికి సరిగ్గా కొద్ది రోజుల ముందు ఝలక్ ఇచ్చింది. తామిద్దరం పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అప్పటికీ ఇప్పటికీ అదో పెద్ద సస్పెన్స్. ప్రేమించి, పెళ్ళి చేసుకోడానికి సిద్ధపడి.. త్రిష ఎందుకు ఇలా చేసిందబ్బా.?
రష్మిక మండన్న :
heroines cancelling marriages -Rashmika
ఇప్పుడు తెలుగు సినిమాలతోనూ, తమిళ, హిందీ సినిమాలతోనూ చాలా బిజీగా వున్న రష్మిక మండన్న, ఒకప్పుడు పెళ్ళి చేసేసుకుని, సినిమాలకు దూరమవ్వాలనుకుంది. ప్రేమించినోడితో నిశ్చితార్థం కూడా చేసేసుకుంది రష్మిక. కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆమె ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. అదో పెద్ద గొడవ. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. సినిమాల్లో చాలా చాలా బిజీ అయిపోయింది. రష్మికను దక్కించుకోలేకపోయిన ఆ అభాగ్యుడెవరో కాదు, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి.
కత్రినా కైఫ్ :
heroines gave shock to boyfriend – katrina kaif
కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. పెళ్ళి చేసుకుందామనుకుని ఓ ఖరీదైన ఫ్లాట్ కూడా సంయుక్తంగా కొనుగోలు చేశారు. ఏమయ్యిందోగానీ, ఆ తర్వాత ఇద్దరూ ఏమీ ఎరగనట్టు విడిపోయారు. హిందీ సినీ పరిశ్రమలో ఇలాంటి కథలు చాలానే వున్నాయి. కత్రినా అయితే, సల్మాన్ ఖాన్ విషయంలోనూ ఇలానే చేసింది. కత్రినా తనను మోసం చేసిందని సల్మాన్ వాపోయిన సందర్భాలూ వున్నాయ్.
శృతిహాసన్ :
shruthi hassan was with ex boy friend michael
శృతిహాసన్, మైఖేల్ కోర్సలే మధ్య కొన్నాళ్ళు ఎఫైర్ నడిచింది. మైఖేల్.. శృతి తండ్రి కమల్ హాసన్ కి కూడా నచ్చేశాడు. శృతి కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయాడు మైఖేల్. కానీ, అనూహ్యంగా శృతి – మైఖేల్ విడిపోయారు. ప్రస్తుతం కొత్త స్నేహితుడితో డేటింగులో మునిగి తేలుతోంది. అంటే, ఇది రెండో ప్రేమ కథ అన్నమాట. ఈ ప్రేమ కథ అయినా, పెళ్ళి పీటలెక్కుతుందా? చూడాలిక.
shruthi with her new boyfriend
అక్షర:
heroines callingoff their relationship- Akshara hassan
అక్షర హాసన్ కూడా కొన్నాళ్ళ క్రితం ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ డేటింగుకి దారి తీసింది. అతనెవరో కాదు నటుడు తనూజ్ విర్వానీ. ప్రేమించుకున్నాం, విడిపోయాం.. అని అక్షర తన పాత స్నేహితుడితో ఎఫైర్ గురించి చాలా లైట్ తీసుకుంటుంది.
నయనతార :
heroines callingoff her relationships – Nayanatara
నయనతార గతంలో శింబుతో పీకల్లోతు ప్రేమాయణం నడిచింది. అది బెడిసికొట్టాక, ప్రభుదేవాతో ఎఫైర్ పెట్టుకుంది. ప్రభుదేవా తన భార్యతో గొడవపడాల్సి వచ్చింది నయనతార కారణంగా. ప్రభుదేవా – నయనతార మధ్య బ్రేకప్ అయిపోయింది ఎట్టకేలకు. అనంతరం, నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడింది. అయితే, పెళ్ళి గురించి మాత్రం అస్సలు ప్రశ్నించొద్దంటుంది నయనతార.. అదేంటో మరి.
అంజలి :
heoines calling off their realtionships – Anjali
మన తెలుగమ్మాయ్ అంజలి, తమిళ నటుడు జైతో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్ళు సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ, అది కూడా బ్రేకప్ అయిపోయింది. తాను ప్రేమలో మోసపోయినట్లు వాపోతోంది అంజలి.