క్యూట్ అండ్ హాట్: కుర్ర గుండెల్ని కోత పెట్టేసిన హీరోయిన్లు, డైలాగులు..

చక్కనమ్మ ఏం చెప్పినా అందమే. అలాంటిది, కుర్రకారు గుండెలకి కోత పెట్టేలా క్యూటుగా డైలాగులు చెబితే ఇంకేమన్నా వుందా.? అందుకే మరి, దర్శకులు.. కొందరి విషయంలో చాలా చాలా ఆలోచించి క్యూట్ క్యూట్ డైలాగులు ప్రిపేర్ చేయిస్తుంటారు. ఆ డైలాగులు ఆయా హీరోయిన్ల నోట వస్తోంటే, వెండితెరపై అదంతా చూసే కుర్రకారు గుండెలు నిజంగానే కోతకు గురవుతాయ్.. ఆ గాయాలు చాలా తియ్యగా వుంటాయ్.. ఎన్నేళ్ళయినా ఆ గాయాలు తగ్గిపోవ్ మరి. అలాంటి క్యూటు భామలు, ఆ […].

By: jyothi

Published Date - Mon - 31 May 21

క్యూట్ అండ్ హాట్: కుర్ర గుండెల్ని కోత పెట్టేసిన హీరోయిన్లు, డైలాగులు..

చక్కనమ్మ ఏం చెప్పినా అందమే. అలాంటిది, కుర్రకారు గుండెలకి కోత పెట్టేలా క్యూటుగా డైలాగులు చెబితే ఇంకేమన్నా వుందా.? అందుకే మరి, దర్శకులు.. కొందరి విషయంలో చాలా చాలా ఆలోచించి క్యూట్ క్యూట్ డైలాగులు ప్రిపేర్ చేయిస్తుంటారు. ఆ డైలాగులు ఆయా హీరోయిన్ల నోట వస్తోంటే, వెండితెరపై అదంతా చూసే కుర్రకారు గుండెలు నిజంగానే కోతకు గురవుతాయ్.. ఆ గాయాలు చాలా తియ్యగా వుంటాయ్.. ఎన్నేళ్ళయినా ఆ గాయాలు తగ్గిపోవ్ మరి. అలాంటి క్యూటు భామలు, ఆ క్యూటు డైలాగులనే గాయాల గురించి తెలుసుకోవడానికెందుకు ఆలస్యం.. పదండిక.

ఏకడా..

 

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగమ్మ శ్వేతా బసు ప్రసాద్.. తొలి సినిమాకే సమ్ థింగ్ డిఫరెంట్ గా అట్రాక్ట్ చేసింది. ’ఏ క డా..‘ అంటూ కుర్రకారు గుండెల్ని మెల్లగా గిల్లి లొల్లి చేసింది.

వెళ్ళవయ్యా వెళ్ళూ..

’జయం‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సదా ’వెళ్లవయ్యా వెళ్లు.. ‘ అంటూ తన క్యూట్ మేనరిజమ్ తో కుర్రకారును కట్టి పడేసింది. ఈ డైలాగ్ యూత్ లో చాలా కాలం తెగ నానిపోయింది.

వీడు ముసలోడవకూడదే..

‘ ఉప్పెన’ సినిమాతో డెబ్యూ చేసిన ముద్దుగుమ్మ క్రితిశెట్టి. ’వీడు ముసలోడవకూడదే..‘ అంటూ ఈ సినిమాలో క్రితి శెట్టి చెప్పిన డైలాగ్ యూత్ లో బాగా క్రేజ్ సంపాదించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో, ఈ డైలాగ్ ఎంత ట్రెండింగ్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చెప్పానా.. నేను చెప్పానా.?

‘క్రిష్ణగాడి వీరప్రేమ గాధ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ముద్దుగుమ్మ మెహరీన్.. ‘చెప్పానా.. నేను చెప్పానా..‘ అనే డైలాగ్ తో కొత్త కిక్కిచ్చింది. క్యూట్ క్యూట్ గా ఆమె నోటి వెంట పలికిన ఈ డైలాగ్ కి అబ్బాయిలూ, అమ్మాయిలూ తెగ ఫిదా అయిపోయారంతే.

నాకన్నీ అలా తెలిసిపోతుంటాయంతే..

తెలుగమ్మాయి అంజలి.. ’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘ సినిమాలో ‘ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే..’ అంటూ కుర్రోళ్ల గుండెల్ని కోత పెట్టేసింది. ఎప్పుడో ఇండస్ర్టీకి పరిచయమైనా, అంజలికి పూర్తి స్తాయి తొలి తెలుగు సినిమా ఇదే అని చెప్పాలేమో.

ప్రార్థన ఇక్కడ..

అంటూ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, తొలి సినిమాకే కుర్రోళ్ల మనసుల్ని కొల్లగొట్టేసింది. తొలి సినిమాతో హిట్ కొట్టడమే కాదు, ఆ పై వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది.

’భానుమతి హైబ్రీడ్ పిల్ల.. ఒక్కటే పీస్..‘

ఈ డైలాగ్ అక్షరాలా సాయిపల్లవి కోసమే పుట్టిందనిపిస్తుంది. ’ఫిదా‘ మూవీలోని ఈ ఒక్క డైలాగ్ తో సాయి పల్లవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతకు మించిన మ్యాజిక్ ఏదో మన హైబ్రీడ్ పిల్ల సాయి పల్లవిలో ఉందనుకోండి.

ఇంకా ఇలాంటివి చాలానే వున్నాయ్. ప్రస్తుతానికి ఇక్కడితో ఇలా ముగించేద్దాం.

Tags

Latest News

Related News