భయంకరమైన ‘కురూపి’ గెటప్పులేసిన హీరోలెవరంటే..

సినిమా సినిమాకీ గెటప్పులు మార్చుతున్న కాలమిది. కొత్త గెటప్ కోసం అంతర్జాతీయ మేకప్ ఆర్టిస్టుల్ని రప్పిస్తున్నారు నేటితరం హీరోలు తమ తమ కొత్త సినిమాల నిమిత్తం. గడ్డం, మీసం, నెత్తి మీద జుట్టు.. ఇలా ప్రతీదీ స్టయిలిష్.. మోస్ట్ స్టయిలిష్.. అనేలా వుండాల్సిందే. మరి, అత్యంత భయానకంగా, కురూపితనంతో కనిపించాల్సి వస్తే.? బహుశా ఈ తరం హీరోల్లో అంత రిస్క్ తీసుకునేది చాలా తక్కువమంది మాత్రమే కావొచ్చు. అసలుంటారో వుండరో కూడా చెప్పలేం. కానీ, ట్రెండ్ మారుతోంది. […].

By: jyothi

Published Date - Mon - 24 May 21

భయంకరమైన ‘కురూపి’ గెటప్పులేసిన హీరోలెవరంటే..

సినిమా సినిమాకీ గెటప్పులు మార్చుతున్న కాలమిది. కొత్త గెటప్ కోసం అంతర్జాతీయ మేకప్ ఆర్టిస్టుల్ని రప్పిస్తున్నారు నేటితరం హీరోలు తమ తమ కొత్త సినిమాల నిమిత్తం. గడ్డం, మీసం, నెత్తి మీద జుట్టు.. ఇలా ప్రతీదీ స్టయిలిష్.. మోస్ట్ స్టయిలిష్.. అనేలా వుండాల్సిందే. మరి, అత్యంత భయానకంగా, కురూపితనంతో కనిపించాల్సి వస్తే.? బహుశా ఈ తరం హీరోల్లో అంత రిస్క్ తీసుకునేది చాలా తక్కువమంది మాత్రమే కావొచ్చు. అసలుంటారో వుండరో కూడా చెప్పలేం. కానీ, ట్రెండ్ మారుతోంది. తెరపై గెటప్ అందంగా కనిపించకపోయినా, పాత్ర బలంగా వుండాలనే ఆలోచన కొందరు అగ్ర హీరోల్లోనూ కలుగుతోంది. ఒకప్పటి, ఇప్పటి వెరీ వెరీ స్పెషల్ గెటప్పుల గురించి తెలుసుకుందాం పదండిక.

నందమూరి బాలకృష్ణ

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘భైరవ ద్వీపం’ సినిమాలో కురూపి గెటప్ వేశారు. ఆ పాత్ర అప్పట్లో పెను సంచలనం. అసలు ఇలాంటి పాత్రలో కనిపించడానికి ఏ అగ్రహీరో అయినా ఒప్పుకుంటాడా? అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ గెటప్ వేయడమే కాదు, నటన పరంగానూ ఆ పాత్రలో ఒదిగిపోయారు బాలయ్య. ‘భైరవ ద్వీపం’ బాలయ్య నట జీవితంలోనే వెరీ వెరీ స్పెషల్ మూవీ.

విక్టరీ వెంకటేష్.. నాగవల్లి

హీరో విక్టరీ వెంకటేష్, ‘నాగవల్లి’ సినిమాలో అత్యంత భయానకమైన, జుగుప్సాకరమైన పాత్రలో కనిపించాడు. అయితే, ఆ పాత్ర వల్ల ఆ సినిమాకి ఒరిగిన లాభమేమీ లేదు. వెంకటేష్ కెరీర్ పరంగా చూసుకుంటే, ‘నాగవల్లి’ సినిమాతోపాటు, అందులోని ఆ ముసలి జుగుప్సాకరమైన పాత్ర కూడా ఓ బ్లాక్ మార్క్

విక్రమ్ – ఐ

విలక్షణ నటుడు విక్రమ్, ‘ఐ’ సినిమా కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు. అనూహ్యంగా బరువు తగ్గిపోయి, చాలా బరువైన మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. భయానకంగా వుండేలా శరీరమ్మీద కణితుల్ని మేకప్ చేశారు. సినిమా కథకి యాప్ట్ అన్నట్లుగా ఆ గెటప్ వున్నప్పటికీ, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

సూర్య – సుందరాంగుడు

తమిళ హీరో సూర్య, ‘సుందరాంగుడు’ అనే సినిమా కోసం వీపు మీద ఓ పెద్ద కణితిని మోసే వ్యక్తిగా కనిపించాడు. ఇది కూడా చాలా క్లిష్టమైన పాత్ర. నటుడిగా సూర్యకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

జగపతిబాబు – అరవింద సమేత

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అరవింద సమేత’ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులోని బసి రెడ్డి పాత్ర కోసం జగపతిబాబు, భయంకరమైన గెటప్ వేయాల్సి వచ్చింది. మెడ మీద కత్తిగాటు తాలూకు మచ్చ సహా, అనేక ప్రత్యేకతలు ఈ పాత్రని బీభత్సంగా, ఒకింత జుగుప్సాకరంగా మార్చేసింది. జగపతిబాబుకి మంచి పేరు తెచ్చింది ఈ పాత్ర, ప్రతినాయకుడిగా.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News