Chiranjeevi-Nagababu: నాగబాబు ప్రొడ్యూసర్ గా చిరంజీవి హీరోగా వచ్చిన సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

Chiranjeevi-Nagababu తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారిని మించిన హీరో ఇంకొకరు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు డాన్స్ లో ఫైట్ లో యాక్టింగ్ లో అన్ని విభాగాల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు సాధించుకున్నాడు. కానీ ఇప్పుడున్న హీరోల్లో యాక్టింగ్ వస్తే డాన్స్ రాదు డాన్స్ వస్తే యాక్టింగ్ రాదు ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ మాత్రమే ఉన్నాయి కానీ చిరంజీవి […].

By: jyothi

Updated On - Mon - 30 August 21

Chiranjeevi-Nagababu: నాగబాబు ప్రొడ్యూసర్ గా చిరంజీవి హీరోగా వచ్చిన సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

Chiranjeevi-Nagababu తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారిని మించిన హీరో ఇంకొకరు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు డాన్స్ లో ఫైట్ లో యాక్టింగ్ లో అన్ని విభాగాల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు సాధించుకున్నాడు. కానీ ఇప్పుడున్న హీరోల్లో యాక్టింగ్ వస్తే డాన్స్ రాదు డాన్స్ వస్తే యాక్టింగ్ రాదు ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ మాత్రమే ఉన్నాయి కానీ చిరంజీవి అన్ని క్వాలిటీస్ కలిగిన హీరో అలాంటి హీరో ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇంకా దొరకలేదు.

అయితే చిరంజీవి ఇండస్ట్రీ లో వరుస హిట్ మీద హిట్ కొడుతూ మెగాస్టార్ గా ఎదిగాడు అయితే ఒక టైంలో చిరంజీవి తన పెద్ద తమ్ముడు అయిన నాగబాబు ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కానీ నాగబాబు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో నాగ బాబు హీరోగా రాణించలేకపోయాడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ ని కూడా సినిమాల్లోకి రమ్మని చిరంజీవి చెప్పాడు దాంతో పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకపోయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ని సినిమాల్లోకి రప్పించాడు మొదటగా చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు ప్రస్తుతం పవర్ స్టార్ గా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నాడు. అయితే నాగబాబుని ఇండస్ట్రీలోనే ఎలాగైనా సెట్ చేయాలి అనుకొని చిరంజీవి తల్లి అయిన అంజనాదేవి పేరుమీద అంజన ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశారు అయితే నాగబాబు ప్రొడ్యూసర్ గా చిరంజీవి చేసిన 5 సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం…

రుద్రవీణ

కె.బాలచందర్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన రుద్రవీణ సినిమా అప్పట్లో ఒక మంచి సినిమాగా గుర్తింపు పొందింది కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి పేరు లభించింది అయితే ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

త్రినేత్రుడు

చిరంజీవి 100 వ సినిమా అనగానే చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా చాలా ఆసక్తి నెలకొంది ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు అనే విషయాలు కూడా చాలామంది లో ఆసక్తిని రేకెత్తించాయి అయితే చిరంజీవి అంజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై తన 100 వ సినిమా నాగబాబు ప్రొడ్యూసర్ గా చేశారు ఈ సినిమాకి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని అందించలేదు.

ముగ్గురు మొనగాళ్లు

రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమాకి కూడా నాగబాబు ప్రొడ్యూసర్ గా ఉన్నాడు అయితే మొదటిసారిగా ఈ సినిమాలో చిరంజీవి మూడు పాత్రలను పోషించాడు ఫాన్స్ తో పాటు అభిమానులకు కూడా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగాయి చిరంజీవి మూడు పాత్రల్లో నటిస్తున్నాడు అనగానే చిరంజీవి నటన చూడడానికి చాలామంది ఉత్సాహం చూపించారు అయితే ఈ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద యావరేజ్ హిట్ ను సొంతం చేసుకుంది…

బావగారు బాగున్నారా

చిరంజీవి హీరోగా రంభ హీరోయిన్ గా జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన బావగారు బాగున్నారా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమాకి కూడా నాగబాబు ప్రొడ్యూసర్ గా ఉన్నాడు ఈ సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా శ్రీహరి చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు జనాలని విపరీతంగా అలరించాయి.చిరంజీవి రంభ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి అలాగే చిరంజీవి ఫ్రెండ్ గా బ్రహ్మానందం నటించిన నటనకు విమర్శకుల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది…

స్టాలిన్

చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా నాగబాబు వ్యవహరించాడు ఈ సినిమా లో చిరంజీవి ఆర్మీ ఆఫీసర్ గా నటించిమంచి పేరు సంపాదించుకున్నాడు అలాగే సోషల్ మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలిచింది…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News