Sudigali Sudheer : బుల్లితెరపై అందరి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది మాత్రం సుడిగాలి సుధీర్ కు అని మాత్రమే చెప్పాలి. జబర్దస్త్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. మల్టీ ట్యాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. జబర్దస్త్ లో చేస్తున్నప్పుడే ఢీషోకు ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీతో ఏకంగా యాంకర్ గా మారిపో యాడు. ఇటు బుల్లితెరపై చేస్తున్నప్పుడే సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. అయితే మొన్నామధ్య మల్లెమాల నుంచి వెళ్లిపోయి స్టార్ మాలో కొన్ని రోజులు చేశాడు. ఇప్పుడు స్టార్ మాలో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. దాంతో ఆయన చేతిలో పెద్దగా ప్రోగ్రామ్స్ లేకుండా పోయాయి.
కాగా ఆయన మల్లెమాలకు రీ ఎంట్రీ ఇవ్వాలని బాగానే ప్రయత్నిస్తున్నాడంట. శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా చేయాలని ప్రయత్నిస్తుంటే.. హైపర్ ఆది అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సుధీర్ వస్తే ఇప్పుడున్న నెంబర్ వన్ స్థాయి పోతుందని.. అప్పుడు మళ్లీ సుధీర్ నెంబర్ వన్ అవుతాడని ఆది భావిస్తున్నాడు.
అందుకే సుధీర్ మీద లేనిపోనివి మల్లెమాల మేనేజ్ మెంట్ కు చెబుతున్నాడంట. ఒకసారి వెళ్లిపోయిన వారిని తీసుకుంటే.. అందరికీ అదే అలవాటు అవుతుందని.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుందని చెబుతూ సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు ఆది. ఈ విషయం తెలుసుకున్న సుధీర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Read Also : Shruti Haasan : ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది.. శృతిహాసన్ ఇలా తెగించిందేంట్రా బాబు..!
Read Also : Sreeleela : శ్రీలీల కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కుందా.. కోరిక తీర్చమన్న స్టార్ డైరెక్టర్..!