Ileana D’Cruz : ఇప్పుడు సినిమా రంగంలో ఛాన్సులు రావాలంటే కచ్చితంగా కమిట్ మెంట్ ఇవ్వాల్సిందే అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న అమ్మాయిలకు హీరోయిన్ గా ఛాన్సులు రావాలంటే మాత్రం వారు దీన్ని ఎదుర్కోవాల్సిందే. కాగా కొంత మంది దానికి ఒప్పుకుంటారు.
మరికొందరు మాత్రం దానికి అస్సలు ఒప్పుకోరు. కొందరు ట్యాలెంట్ తో పైకి వస్తారు. మరికొందరు కనుమరుగైపోతారు. అయితే మీటూ ఉద్యమం తర్వాత చాలామంది దీనిపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా దీనిపై స్పందించింది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది.
ఇక రీసెంట్ గానే ప్రెగ్నెంట్ అంటూ సంచలనం రేపింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. తాను గతంలో ఎదుర్కున్న అనుభవాలను పంచుకుంది. నేను మొదట్లో టాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేసినప్పుడు స్టార్ హీరోలు కూడా నన్ను కమిట్ మెంట్ అడిగారు.
స్టార్ డైరెక్టర్లు కూడా ఆ లిస్టులో ఉన్నారు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. నా ట్యాలెంట్ తోనే ఛాన్సులు వచ్చాయి. నేను ట్రాక్ లోకి వచ్చిన తర్వాత అదే స్టార్ హీరోలు నాకు అవకాశాలు ఇచ్చారు. అందుకే నేను వారి పేర్లు బయట పెట్టాలనుకోవట్లేదు. ఇప్పటికీ నాకు ఆ స్టార్ హీరోలు సన్నిహితంగానే ఉన్నారు.
Read Also : Varun Tej : ఆ ఒక్క సినిమా చేసుంటే వరుణ్ తేజ్ స్టార్ హీరో అయ్యేవాడే.. బ్యాడ్ లక్..!
Read Also : Star Hero : తండ్రి వయసున్న హీరోతో యంగ్ హీరోయిన్ రాసలీలలు.. ఇదేం బుద్ధి తల్లీ..!