Trivikram : త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం…

Trivikram సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన చాలా మంది వెండితెర పై వాళ్ళ ముద్రను వేస్తూ చాలా హిట్ సినిమాలను తీశారు అలాగే ఇండస్ట్రీలో మొదటగా రైటర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి పరిచయం అవసరం లేదు. ఆయన రాసిన నువ్వు నాకు నచ్చావ్,మన్మధుడు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి ఆయన దర్శకత్వంలో వచ్చిన నువ్వే నువ్వే, అతడు, […].

By: jyothi

Updated On - Mon - 2 August 21

Trivikram : త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం…

Trivikram సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన చాలా మంది వెండితెర పై వాళ్ళ ముద్రను వేస్తూ చాలా హిట్ సినిమాలను తీశారు అలాగే ఇండస్ట్రీలో మొదటగా రైటర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి పరిచయం అవసరం లేదు. ఆయన రాసిన నువ్వు నాకు నచ్చావ్,మన్మధుడు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి ఆయన దర్శకత్వంలో వచ్చిన నువ్వే నువ్వే, అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిపోయాయి ఈ మధ్య ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత, అల్లు అర్జున్ తీసిన అలా వైకుంఠపురం లో సినిమాలు కూడా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ స్టోరీని రెడీ చేశాడు. అయితే త్రివిక్రమ్ పర్సనల్ జీవితానికి వస్తే ఆయన సినిమాల్లో రైటర్ గా ఉన్నప్పుడే సీతారామశాస్త్రి గారి అన్నయ్య వాళ్ళ కూతురు ని పెళ్లి చూపుల కోసం చూడడానికి వెళ్ళాడు. అక్కడ అక్క ని చూపిస్తే త్రివిక్రమ్ కి మాత్రం పక్కనే కూర్చున్న చెల్లెలు నచ్చింది దాంతో పెద్దలను ఒప్పించి తనకు నచ్చిన చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బహుశా త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే చిన్న అమ్మాయిని ప్రేమించడం అనేది ఆయన నిజ జీవితం ఆధారంగానే సినిమాల్లో రాసుకుంటారు ఏమో అని ఈ సందర్భాన్ని చూస్తే అనిపిస్తూ ఉంటుంది త్రివిక్రమ్ పెళ్లి ఫోటోలు మనం గమనిస్తే అప్పట్లో త్రివిక్రమ్ కొంచెం లావుగా ఉన్నట్టు గా కనిపిస్తూ ఉంటారు.

ఆ తర్వాత త్రివిక్రమ్ ఫిట్ నెస్ మీద ఫోకస్ చేసి కొంచెం బరువు తగ్గాడని తెలుస్తుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సునీల్ తో కలిసి ఇద్దరు రూమ్మేట్స్ గా ఉంటూ సినిమాల్లో ప్రయత్నం చేసేవారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే త్రివిక్రమ్ మాత్రం నిన్నేప్రేమిస్తా సినిమాతో ఇండస్ట్రీకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత నువ్వే కావాలి సినిమా తో రైటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ సినిమా తర్వాత విజయభాస్కర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాలు చేస్తూ వీళ్ళిద్దరి కాంబినేషన్ గా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు అలాంటి కొన్ని సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ కి బ్రేక్ పడింది ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో విజయ భాస్కర్ గారికి కథ రాయలేకపోయారు. ఆ తర్వాత విజయభాస్కర్ దర్శకుడుగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ దాంట్లో ఏ సినిమాలు పెద్దగా ఆడలేదని చెప్పాలి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అలాగే త్రివిక్రమ్ కి కూడా దర్శకుడిగా మంచి విజయాన్ని అందించింది ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.అయితే తన ఫ్రెండ్ అయిన సునీల్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళిద్దరు స్టార్టింగ్ డేస్ లో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో గుర్తు చేసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా త్రివిక్రమ్ ఆడియో ఫంక్షన్ లో గాని, రిలీజ్ ఈవెంట్ లో గాని, సన్మాన సభలో గాని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి ఆయన సినిమాలకే కాదు మాట్లాడే మాటలకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు సీతారామశాస్త్రి గారి గురించి మాట్లాడిన మాటల వీడియో అయితే ఇప్పటికీ యూట్యూబ్లో చాలా ఎక్కువ వ్యూస్ ని సొంతం చేసుకుంది అనే చెప్పాలి…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News