Samantha : హీరోయిన్ సమంత మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె నటించిన శాకుంతలం మూవీ తాజాగా విడుదలైంది. కానీ అంచనాలను అందుకోలేక నెగెటివ్ రివ్యూలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ సమంత మాత్రం తన ప్రయత్నాలను ఆపట్లేదు. సినిమా కోసం బాగానే ప్రమోషన్లు చేస్తోంది. వరసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె కాతువక్కల రెండు కాదల్ మూవీ గురించి స్పందించింది. గతేడాది వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా చేయగా.. ఆయన భార్యలుగా నయనతార, సమంత నటించారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు భార్యలు అనే కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.
కాగా తాజాగా ఇంటర్వ్యూలో మీరు ఇద్దరు భార్యల కాన్సెప్ట్ ను ఎంకరేజ్ చేస్తున్నారా అని అడగ్గా.. సమంత స్పందించింది. బేసిక్ గా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. అందుకే నన్ను నేను సీరియస్ గా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించను. నాకు ఖాళీ సమయం దొరికితే కామెడీ సినిమాలే చూస్తాను.
Interview Samantha Responded On Concept Of Two Wives
పైగా విజయ్ సేతుపతి, నయనతారలతో నటించాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అందుకే వారు అడగ్గానే ఆ సినిమాలో నటించాను. అంతే తప్ప అందులో ఎలాంటి మీనింగ్ లేదు అంటూ సమంత క్లారిటీ ఇచ్చింది. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Read Also : Mega Family Heroes : మెగా హీరోలను తిట్టి ఛాన్సులు కోల్పోయింది వీరే.. ఎవరెవరంటే..?
Read Also : Sri Reddy : మెగా హీరోలంతా డమ్మీగాళ్లే.. శ్రీరెడ్డి దుమారం రేపే కామెంట్లు..!