Intinti Gruahalakshmi 1 nov Today Episode : జీకే ఇంటికి వెళ్లిన నందు.. బావ‌ను ఎలా అయ్యానంటూ సీరియ‌స్ అయిన జీకే

Intinti Gruahalakshmi 1 nov Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అందరినీ ఆకట్టుకుంటోంది. తులసిపై కక్ష సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆమె ఎలా ఎదురుకుంటున్నది అనే కాన్పెప్ట్‌తో ప్రస్తుతం ఎపిసోడ్స్ వస్తున్నాయి. మరి ఈ రోజు టెలికాస్ట్ కాబోతున్న (నవంబర్ 1) 465వ ఎపిసోడ్ విశేషాలు తెలుసుకుందాం.. ఫీజు విషయమై దివ్యను ఓదార్చిన తులసి.. కాలేజ్‌కి ఫోన్ చేసి ఫీజు గురించి మాట్లాడతానంటూ దివ్యకు కాస్త ధైర్యాన్ని చెప్తుంది. […].

By: jyothi

Published Date - Mon - 1 November 21

Intinti Gruahalakshmi 1 nov Today Episode : జీకే ఇంటికి వెళ్లిన నందు.. బావ‌ను ఎలా అయ్యానంటూ సీరియ‌స్ అయిన జీకే

Intinti Gruahalakshmi 1 nov Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అందరినీ ఆకట్టుకుంటోంది. తులసిపై కక్ష సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆమె ఎలా ఎదురుకుంటున్నది అనే కాన్పెప్ట్‌తో ప్రస్తుతం ఎపిసోడ్స్ వస్తున్నాయి. మరి ఈ రోజు టెలికాస్ట్ కాబోతున్న (నవంబర్ 1) 465వ ఎపిసోడ్ విశేషాలు తెలుసుకుందాం..

ఫీజు విషయమై దివ్యను ఓదార్చిన తులసి.. కాలేజ్‌కి ఫోన్ చేసి ఫీజు గురించి మాట్లాడతానంటూ దివ్యకు కాస్త ధైర్యాన్ని చెప్తుంది. ఇక అందలోనే అభిపైకి అంకిత ఫైర్ అవుతుంది. ప్రాజెక్టుకు సంబంధించిన బాధ్యతనంతా ఆంటిపై వేసుకుంది. ఇక వర్క్ ఆగినట్టే.. అంకుల్ మాత్రం ఇక ఆఫీస్‌కు వెళ్లను అంటూ చెప్పేశారు. ఎందుకంటే అక్కడ ఆంటి.. అంకుల్‌ను హేళన చెసిందట. ఆంటి పెనాల్టీ కట్టకపోవడంతో ఇంటిని స్వాధీనం చేసుకుంటారంటూ అంకిత కోపానికి వస్తుంది.

ఈ ఇల్లు ఎలాగో మునిగిపోతున్న పడవ అని, ఇక మనం ఇక్కడ ఉండలేమని, వెంటనే బయటకు వెళ్లిపోదామని అంటుంది అంకిత. దీనికి అభి అంగీకరించడు. అంకిత మాటలు విన్న తులసి బాధపడుతూ ఉండిపోతుంది. తన ఫ్యామిలీ విడిపోతుందని తులసి కాస్త ఎమోషనల్ అవుతూ ఏడ్చేస్తుంది. ఇక మరో వైపు నందు ఆలోచనలో పడతాడు. ఇందలో లాస్య ఏంట్రీ ఇస్తుంది.

Intinti Gruahalakshmi 1 nov Today Episode-2

Intinti Gruahalakshmi 1 nov Today Episode-2

నందును గ్రేట్ అంటూ పొగుడుతుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. నాన్న.. మీతో కొంచెం మాట్లాడాలంటూ చెబుతాడు. నీతో ఇక మాట్లాడేది ఏమీ లేదని నందు కాస్త సీరియస్ గానే చెబుతాడు. అమ్మను బాధపెట్టకండి అంటూ ప్రేమ్ రిక్వెస్ట్ చేస్తాడు. నేను తనను బాదపెట్టడం కాదు.. ఆమెనే నన్ను బాధ పెడుతుంది. అని నందు కాస్త ఘాటుగానే రిప్లై ఇస్తాడు.

సీన్ కట్ చేస్తే.. మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్లేందుకు తులసి రెడీ అవుతుంది. నందు కూడా రెడీ అవుతుండటంతో.. ఆఫీసుకు వస్తున్నారా.. అంటూ నందును తులసి అడుగుతుంది. ఆఫీసుకు, నాకు సంబంధం లేదని చెప్పాను కదా. ఇక నీదారి నీది, నా దారి నాదీ అంటూ నందు సీరియస్ గానే చెబుతాడు. ఇక తులసి బదిలిస్తూ.. ఇన్ టైంలోగా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. అది ఒక్కటే నా టార్గెట్ అంటూ చెబుతుంది. ఇక మరో వైపు నందు తల్లితో శ్రుతి గొడవ పడుతుంది. అంతలోనే జీకేను కలిసేందుకు నందు వస్తాడు. ఎలా ఉన్నావ్ బావ అంటూ జీకేను పలకరిస్తాడు. ఎందుకు వచ్చావ్.. బావ ఎలా అయ్యను అంటూ జీకే కాస్త గట్టిగానే అడుగుతాడు. బిజినెస్ గురించి మాట్లాడేందుకు వచ్చానని చెబుతాడు నందు. నా కంపెనీకి సపోర్ట్ కావాలని నందు కోరినా జీకే వినడు.

Tags

Latest News

Related News