Intinti Gruhalakshmi 16 Nov Today Episode.. తెలుగు ప్రేక్షకులను ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బాగా అట్రాక్ట్ చేస్తోంది. చాలా మంది ఈ సీరియల్ ఫ్యాన్స్ గా మారుతున్నారు. తరువాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలయిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుంటే..
ఈ రోజు ఈ సీరియల్ 478వ ఎపిసోడ్ కు చేరుకుందాం. తులసి, లాస్యల ఎత్తులు పై ఎత్తులతో సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రోజటి ఎపిసోడ్ లో తులసిని చూసిన కోపంలో లాస్య లాప్ టాప్ ను ఆపేసి బయటకు వస్తుంది. అక్కడ లాస్యకు భాగ్య కనిపిస్తుంది. ఏమయిందని భాగ్య లాస్యను అడగ్గానే అంతా నీవల్లే జరిగింది అంటూ లాస్య భాగ్య మీద అరుస్తుంది.
దానికి భాగ్య నేనేం చేశాను అని అనగానే తులసి నీవే కదా ఇంట్లో ఎటువంటి గొడవలు చెప్పకుండా నన్ను ఆపావు అని అరుస్తుంది. దీనికి భాగ్య కూల్ లాస్య క్లయింట్ మీటింగ్ అయిపోగానే నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని రచ్చ చేయ్ అని లాస్యకు సలహా ఇస్తుంది. ఈ విషయం విన్న లాస్య ఈ ప్లాన్ ఏదో బాగానే ఉందని అనుకుంటుంది. నువ్వు నందుని పెళ్లి చేసుకుని ఇంటికి యజమానురాలివైతేనే అందరూ నీకు సలామ్ కొడతారని చెబుతుంది. దీంతో ఇదే కరెక్ట్ అని లాస్య అనుకుంటుంది. విజయం వైపు అడుగులేయమని భాగ్య లాస్యకు హిత బోధ చేస్తుంది.
Intinti Gruhalakshmi
ఇక నందూ విషయానికి వస్తే.. తులసితో కలిసి అతడు క్లయింట్ మీటింగ్ కు వెళ్తాడు. అప్పుడు క్లయింట్ తులసితో ప్రాజెక్టు వ్యాల్యూలో కేవలం 60 శాతం మాత్రమే ఇస్తామని చెబుతుంది. అంటే కేవలం 6 కోట్లు మాత్రమే ఇస్తారా అని నందు ప్రశ్నిస్తాడు. దానికి క్లయింట్ అవును అన్నట్లు తల ఊపుతుంది. కేవలం 60 శాతం మాత్రమే ఇస్తామని సంతకం చేయమంటే నందూ సంతకం చేయనని అంటాడు. మమ్మలని సంప్రదించకుండా ఎలా డిసైడ్ చేస్తారని సీరియస్ అవుతాడు. మేము అసలు ప్రాజెక్టే చేయం అని నందూ తెగేసి చెబుతాడు. దీంతో క్లయింట్ మిమ్మల్ని కోర్టుకు లాగుతాం అని అంటుంది.
ఇంతలో సీన్ లోకి తులసి ఎంటర్ అయి మీరు ఏ క్లాజ్ ప్రకారం నందూ మీద కేసు వేస్తారో తెలుసుకోవచ్చా? అని ప్రశ్నిస్తుంది. అంటే నందూ టైంలోపల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే పెనాల్టీ పే చేయాలని ఉంది. ఆ పాయింట్ ను చూపంచమని ధీరజ్ ను అడుగుతుంది. కానీ అగ్రిమెంట్ లో ఆ క్లాజ్ లేకపోవడంతో క్లయింట్ కంగారు పడుతుంది. అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని మాత్రమే అగ్రిమెంట్ లో ఉంటుంది. మీరు మా మంచితనాన్ని అడ్వాన్ గా తీసుకోవాలని చూశారు కాబట్టి మేము మీ ప్రాజెక్ట్ చేయం అని తులసి తెగేసి చెబుతుంది.