Intinti Gruhalakshmi 26 Oct Today Episode : స్టార్ మా ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్లేస్ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. గత వారంగా రోజులుగా ఈ సీరియల్‌లో రొమాంటిక్ యాంగిల్ ను చూపిస్తున్నారు. మరి ఈ రోజు (అక్టోబర్ 26) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఇలాంటి సీన్స్‌ను మరిన్ని చూపించనున్నారు.
అంకిత చెప్పిన మాటలను గుర్తుంచుకుంటున్న లాస్య.. తన భర్తతో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అభికి దగ్గరయ్యినట్టు నటిస్తున్న లాస్య.. అతనిపై ప్రేమను చూపిస్తూనే తన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు నన్ను ఇంటి పెద్దకోడలిగా బాగానే చూస్తుకున్నారని, శృతి వచ్చినప్పటి నుంచి నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదని, చులకనగా చూస్తున్నారని ఏడ్వడం మొదలు పెడుతుంది. ఈ సెంటిమెంట్‌కు అభి ఐస్ అయిపోతాడు. అమ్మాతో మాట్లాడతానని, నీకు ఎలాంటి మాట రానివ్వనని అభి అంకితను ఓదారుస్తాడు.
సీన్ కట్ చేస్తే.. మరో వైపు శృతి, ప్రేమ్ రొమాన్స్‌తో రెచ్చిపోతుంటారు. తల్లి అప్పును తీర్చేందుకు ఫస్ట్ నైట్ వారు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే అమ్మ బాధలో ఉన్నప్పుడు తాను ఎంజాయ్ గా ఉండలేమని వాళ్ల ఫీలింగ్. ఇక కిచెన్‌లో వీరిద్దరు రొమాన్స్ చేసుకుంటారు.
Intinti Gruhalakshmi 26 Oct Today Episode-2
వీరి రొమాన్స్‌ను చూసిన రాములమ్మ అరుస్తుంది. ప్రమ్ శృతి నడుమును గిల్లడంతో ఆమె కూడా అరుస్తుంది. తర్వార వీరి రొమాన్స్‌ను తులసి చూస్తుంది. అనంతరం ఆమె కూడా సిగ్గు పడుతూ ఎవరి కంట పడకండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అంకిత గురించి తులసికి చెబుతాడు అభి. చాలా బాధపడతాడు. అంకితను ఎందుకు శృతితో పోలుస్తున్నారు. ఎందుకు అవమాన పరుస్తున్నారు అంటూ తల్లిని గట్టిగా ప్రశ్నిస్తాడు. దీంతో తులసి సైతం సీరియస్ గానే డైలాగ్స్ వేస్తుంది.
నా ద్వారా మాటలు నేర్చుకున్నవాడు. నా గుండలపై ఆడుకున్నోడు నన్నే తప్పు బడుతున్నాడు అంటూ కాస్త ఎమోషనల్ డైలాగ్ అందుకుంటుంది. ఇక పూజ చేసిన శృతి నందుకు హారతి ఇస్తుంది. అతడు హారతి తీసుకోకుండా లాస్యతో సీరియస్‌గా లోపలికి వెళ్లిపోతాడు. ఇక నందు ఎంత రిక్వెస్ట్ చేసిన పని చేసేందుకు వర్కర్స్ రారు. ఇదే విషయాన్ని తులసి అడగడంతో ఫైర్ అవుతాడు నందు. వాళ్లకి నాపై నమ్మకం లేదని నువ్వు బ్రతిమిలాడుకో అంటూ సీరియస్‌గా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది. తులసి రియాక్షన్ ఏంటి.. ఇందుకు ఇంట్లో వాళ్లు ఎలా స్పందిస్తారు. అనే విషయాలను నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడొచ్చు.