Intinti Gruhalakshmi 29 Oct Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇందులో ఈరోజు (అక్టోబర్ 29న) టెలికాస్ట్ అయ్యే 463వ ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా మారింది.శ్రుతి మీద సీరియస్ అయిన అంకిత.. కూరగాయలను శ్రుతి మీదకు విసిసరేస్తుంది. నన్ను తక్కువ చేస్తూ గొప్పదానివి అయిపోదామని అనుకుంటున్నావంటూ నోటికి వచ్చినట్టు తిడుతుంది.
నాకు ఆ ఉద్దేశం లేదని, నిరూపించుకోవాలంటే ఏం చేయాలో చెప్పాలని శ్రుతి అడుగుతుంది. ఇదే మంచి చాన్స్ అనుకుని నా పనులు మొత్తం చేయాలి అని సీరియస్ గా చెప్పడంతో సరేనంటూ శ్రుతి అడ్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత శ్రుతితో అంకిత తన బెడ్ రూం క్లీన్ చేపిస్తుంది. తర్వాత బెడ్‌పైన ఉన్న అభి ల్యాప్‌లాప్‌ను అంకిత కిందపడేసి ఏం తెలియనట్టు వచ్చి బయట కూర్చుంటుంది.
అంతలోనే పగిలిపోయిన ల్యాబ్‌టాప్‌ను చూసి అభి సీరియస్ అవుతాడు. దీంతో ఇంతకు ముందు బెడ్ రూంలోకి శ్రుతి వచ్చిందని అంకిత శ్రుతిని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. శ్రుతిమీదకు వారిద్దరు సీరియస్ అవుతుందగా ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు. శ్రుతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఇక అంకితకు అనసూయ, శ్రుతికి ముసలాయన సపోర్ట్ చేసి మాట్లాడతారు. అంతా అయిపోయాక చూశావా నిన్ను ఎలా ఇరికించానో అనిక అంకిత శ్రుతికి చెబుతుంది. ఇంకోసారి నా పనులు చేస్తానని ఒప్పుకుంటావా అంటూ ప్రశ్నిస్తుంది. అందుకు శ్రుతి బదులిస్తూ.. నువ్వు మారే వరకు చేస్తానంటూ ఎమోషనల్ అవుతుంది.
Intinti Gruhalakshmi 29 Oct Today Episode-2
తర్వాతి సీన్‌లో.. నందు, లాస్య, తులసి ఆఫీస్‌కు వెళతారు. అక్కడ నిద్రపోతున్న ఆఫీస్ బాయ్‌ను లేపి ఎవరూ రాలేదా అంటూ ప్రశ్నిస్తారు. అనంతరం లోపలికి వెళ్లిపోతారు. తులసి మాత్రం ఇంకా ఎవరూ రాలేదేంటి అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. అంతలోనే అందరూ ఎంట్రీ ఇస్తారు.
దీంతో సంతోషంతో ఉద్యోగులందరూ వచ్చేశారు. మీరు వచ్చి వారితో ఒకసారి మాట్లాడండి అని తులసి అనడంతో లాస్య కలుగజేసుకుని వాళ్లు వచ్చి బాస్‌ను విష్ చేయరా అంటూ కాస్త దెప్పొపొడిచినట్టు మాట్లాడుతుంది.
వారితో నేను మట్లాడటం వేరు, మీరు మాట్లాడటం వేరు.. నేను, మీరు ఒకటే అని వారికి తెలియదు కాదా అని చెబుతుంది. అంటే మన ఇద్దరం ఒకే ప్రాజెక్ట్ వాళ్లం అని వారికి తెలియదు కాదా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో నందు తులసి వెంట వెళ్లిపోతాడు. దీంతో లాస్య షాక్ కు గురవుతుంది. తర్వాత వారితో ప్రాజెక్టు వివరాలు మాట్లాడి ఫైనల్ చేస్తారు. అనంతరం లాస్య నందుకు పిజ్జా తినిపిస్తూ తులసిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.