intinti Gruhalakshmi 3 nov Today Episode : తులసి ప్లాన్ వర్కవుట్.. లాస్యకు పంచ్ పడింది.

intinti Gruhalakshmi 3 nov Today Episode :స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజకో మలుపు తిరుగుతోంది. వీవర్స్‌లోనే ఉత్కంఠ రేపుతోంది. మరి ఈ రోజు (నవంబర్ 2, 2021) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఏం జరగబోతోందో చూద్దాం.తులసికి ఫోన్ చేసిన జీకే.. నందు వచ్చి హెల్ప్ చేయాలని అడిగిన విషయం చెబుతాడు. నందు వద్ద నుంచి కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకున్నావ్ అంట కదా అని చెబుతాడు జీకే. నా మంచి […].

By: jyothi

Published Date - Wed - 3 November 21

intinti Gruhalakshmi 3 nov Today Episode : తులసి ప్లాన్ వర్కవుట్.. లాస్యకు పంచ్ పడింది.

intinti Gruhalakshmi 3 nov Today Episode :స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజకో మలుపు తిరుగుతోంది. వీవర్స్‌లోనే ఉత్కంఠ రేపుతోంది. మరి ఈ రోజు (నవంబర్ 2, 2021) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఏం జరగబోతోందో చూద్దాం.తులసికి ఫోన్ చేసిన జీకే.. నందు వచ్చి హెల్ప్ చేయాలని అడిగిన విషయం చెబుతాడు. నందు వద్ద నుంచి కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకున్నావ్ అంట కదా అని చెబుతాడు జీకే.

నా మంచి తనం, నిజాయితీ తాకట్టు పెట్టుకుని ఎవ్వరినీ అప్పు అడగనని చెబుతుంది తులసి. దీంతో జీకే బదిలిస్తూ.. మీ ఫ్యామిలీకే నా వల్లే ప్రాబ్లమ్స్ వచ్చాయని కాస్త బాధతో చెబుతాడు. దేవుడు అల తల రాత రాస్తే దానికి మీరేం చేస్తారు అన్నయ్య అంటూ చెప్పకొచ్చిన తులసి.. డబ్బు కోసం నందు నీ దగ్గరికి వస్తే ఇవ్వొద్దని జీకేకు చెబుతుంది. అందుకు జీకే సరే అంటాడు. ఎప్పుడు ఎలాంటి అవసరమొచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చొపోవద్దంటూ తులసికి చెబుతాడు జీకే. నందు జీకే దగ్గరికి డబ్బులు కోసం వెళ్లిన విషయం పరాందామయ్యకు తెలుస్తుంది.

ఇక అభి దగ్గరకు వెళ్లిన అంకిత.. మీ డాడి జీకే దగ్గరికి వెళ్లారంటూ డబ్బులు అడిగారంట అని చెబుతుంది. జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెబుతుంది. ఇక జీకే ఇచ్చిన చాన్స్ ను మీ అమ్మ వదులుకుంది, తెలివితక్కువ నిర్ణయం తీసుకుంది అంటూ అంటుంది అంకిత. దాంతో అభి జోక్యం చేసుకుని ఆ అమ్మ ఏదైనా ఆలోచించే చేస్తుంది.

intinti Gruhalakshmi 3 nov Today Episode-1

intinti Gruhalakshmi 3 nov Today Episode-1

తర్వాత అన్ని నీకు చెబుతున్నదందుకు నాకు బుద్ధిలేదు అని అనుకుంటూ అంకిత వెళ్లిపోతుంది. ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన స్టేటస్‌ను అడుగుతుంది తులసి. అందుకు నందు అంగీకరించడు. దీంతో నందును తులసి నానా మాటలు అంటుంది. ఈ క్రమంలో లాస్య ఎంట్రీ ఇచ్చి వారిద్దరి మధ్య గొడవను మరింత పెంచుతుంది. దీంతో నందు, తులసి మధ్య ప్రాజెక్టు విషయమై సవాల్ చేసుకుంటారు. దీంతో నందు తులసి ట్రాప్‌లో పడిపోతాడు.

ఇక వారిద్దరు ఒక్కటిగా పనిచేస్తారని ప్రేమ్ సంతోషపడతాడు. వారిద్దరిని అలా చేస్తే హ్యపీగా ఉందంటూ ఫీల్ అవుతాడు. ఇక శ్రుతి.. తులసిని ఆకాశానికి ఎత్తుతుంది. అందరికీ ఆంటో ఆదర్శమంటూ మెచ్చుకుంటుంది. మరి తర్వాత ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుంది. లాస్య ఇంకేమైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందా. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags

Latest News

Related News