Intinti Gruhalakshmi 4 Nov Today Episode : డబ్బుల విషయమై తులసి టెన్షన్.. అంకిత సాయం.. చివరకు..

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ రోజురోజుకూ ఉత్కంఠభరితమవుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. గురువారం ప్రసారమయ్యే 468వ ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకుందాం.. గత ఎపిసోడ్‌లో నందూను ప్రాజెక్టు విషయమై ఆఫీసుకు రప్పించాలని తులసి చాలెంజ్ చేస్తుంది. దాంతో చాలెంజ్ యాక్సెప్ట్ చేసి మరీ తాను ఆఫీసుకు వస్తానని నందూ ఒప్పుకుంటాడు. అయితే, అలా చేయడం పట్ల లాస్య రగిలిపోతుంది. రేపు ఆఫీసుకు వెళ్లిన తర్వాత నందూ, తులసి […].

By: jyothi

Published Date - Thu - 4 November 21

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : డబ్బుల విషయమై తులసి టెన్షన్.. అంకిత సాయం.. చివరకు..

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ రోజురోజుకూ ఉత్కంఠభరితమవుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. గురువారం ప్రసారమయ్యే 468వ ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకుందాం..

గత ఎపిసోడ్‌లో నందూను ప్రాజెక్టు విషయమై ఆఫీసుకు రప్పించాలని తులసి చాలెంజ్ చేస్తుంది. దాంతో చాలెంజ్ యాక్సెప్ట్ చేసి మరీ తాను ఆఫీసుకు వస్తానని నందూ ఒప్పుకుంటాడు. అయితే, అలా చేయడం పట్ల లాస్య రగిలిపోతుంది. రేపు ఆఫీసుకు వెళ్లిన తర్వాత నందూ, తులసి పక్కపక్కనే కూర్చుంటారని, నందూకు ఏం జరిగినా తులసి చూసుకుంటుందని, నందూకు చెమట వస్తే తులసి తన కొంగుతో తూడుస్తుందని అనుకుంటూ లాస్య ఫైర్ అవుతుంటుంది. ఈ విషయమై నందూతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. నందూ స్పందిస్తాడు. తాను తులసిని అస్సలు పట్టించుకోబోనని, తనకు ఆఫీస్ బాయ్‌కు పెద్ద తేడా ఏం లేదని అంటాడు నందూ.

తన కష్టమెంటే తెలిసేలా చేస్తానని, ప్రతీకారం తీసుకుంటానని నందూ అంటాడు. ఇంతలో మరో వైపున కంపెనీలో ఉద్యోగుల వేతనాల విషయమై చర్చ వస్తుంది. నందూ తండ్రి తులసిని వేతనాలు చెల్లించాలని గుర్తు చేస్తాడు. దాంతో తులసి తన ఆఫీస్ మేనేజర్‌కు ఫోన్ చేసి రూ.5 లక్షలు వేతనం కోసం పంపాలని చెప్తుంది. అయితే, అంత డబ్బు లేదని, ఆఫీసులో మెషిన్ సమస్యలు వస్తే ఖర్చయ్యాయని, కేవలం రూ.3 లక్షలే ఉన్నాయని, అందులో రూ.50 వేలు మినిమమ్ బ్యాలెన్స్ అని చెప్పతాడు. దాంతో తులసికి డబ్బుల విషయమై టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం మామ గారికి చెప్తూనే మారో రెండున్నర లక్షల రూపాయలు కావాలని తనలో తాను మధనపడుతుంటుంది.

Intinti Gruhalakshmi 4 Nov Today Episode

Intinti Gruhalakshmi 4 Nov Today Episode

తులసి డబ్బుల విషయమై మధనపడుతున్న విషయం గ్రహించిన శృతి తన తల్లి ఆభరణాలు తాకట్టు పెట్టి మరీ రూ.50 వేలు తెచ్చి ప్రేమ్‌కు ఇస్తుంది. ఆ డబ్బు తులసికి ఇవ్వాలని చెప్తుంది. ఇంతలోనే ఆభరణాలు తాకట్టు పెట్టిన విషయం చర్చకు వచ్చి శృతిని అలా ఎందుకు చేశావని తులసి అడుగుతుంది. ఇకపోతే రెండున్నర లక్షల రూపాయలను అంకిత తెచ్చి ఇస్తుంది.

తన భర్త అభితో ఆ మనీ తెప్పించి ఇస్తుంది. అభి లోన్ తీసుకుని ఆ డబ్బు ఇస్తున్నట్లు వివరిస్తుంది. దాంతో ప్రేమ్, శృతి ముఖాలు మాడిపోతాయి. అంతలో ఏమైంది రా ప్రేమ్ అని తులసి అడుగుతుంది. అప్పుడు శృతి చేసిన పని తులసికి తెలుస్తుంది. అలా ప్రేమ్, శృతిలను అంకిత అవమానించినంత పని చేస్తుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక కమింగ్ అప్‌లో నందూ తండ్రి తులసి ప్రేమ్ గురించి చెప్పే సీన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అదేంటో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Tags

Related News