Intinti Gruhalakshmi 6th Nov Episode : బుల్లితెరపై సందడి చేసే సీరియల్స్‌లో ఒకటైన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రాజెక్టు విషయమై తనతో కలసి పని చేయడానికి తులసి నందును ఎట్టకేలకు ఒప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు రూ.5 లక్షలు అవసరంగా కాగా, వాటిని అంకింత అందజేస్తుంది. ఈ క్రమంలోనే అంకిత శ్రుతిపైన అక్కసు వెళ్లకక్కుతుంది.
ఈ సంగతులు ఇలా ఉంచితే.. నందుకు దగ్గరయ్యేందుకు తులసి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే శ్రుతి, అంకిత మధ్య ఘర్షణ కూడా కొనసాగు..తూనే ఉన్నది. పూజ విషయమై అంకిత, శ్రుతి మధ్య గొడవ జరగగా, ఇద్దరి మధ్య వాదోప వాదనలు జరుగుతాయి. ఇద్దరూ గట్టిగానే వాదించుకుంటారు. కాగా, చివరకు శ్రుతిని బెదిరించి అంకింత పై చేయి సాధిస్తుంది.
Intinti Gruhalakshmi 6th Nov Episode
లోపలికి వెళ్లి అంట్లు తోముకో అని శ్రుతిని అంకిత దారుణంగా బెదిరిస్తుంది. అందుకుగాను శ్రుతి ఏడుస్తూ మౌనంగానే ఉండిపోతుంది. ఈ క్రమంలోనే మరో వైపున నందు, లాస్యలు ఆఫీసుకు బయలుదేరి వస్తుండగా, హారతి తీసుకుని ఎదురుగా వస్తుంది అంకిత. దాంతో తులసి హారతి తీసుకుంటుంది. తులసిని చూసి తీసుకున్నాడో ఏమో తెలియదు కాని నందు కూడా హారతి తీసుకుంటాడు. అది చూసి నందు షాక్ అవుతుంది. అదేంటీ.. నందు ఇలా చేస్తున్నావ్ అని అంటుంది. అప్పుడు పరంధామయ్య హారతి తీసుకోవడంలో తప్పేంటని అంటాడు. మంచి అలవాట్లు తులసితో కలిసి తిరుగుతున్నాడు కాబట్టే మళ్లీ అలవడుతున్నాయని పరంధామయ్య వివరిస్తాడు.
ఇకపోతే లంచ్ బాక్స్ తీసుకుని రావాలని నందు రాములమ్మను అడగగా, శ్రుతి తీసుకుని వస్తుంది. దాంతో నందు శ్రుతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా ఆగ్రహం వ్యక్తం చేసినందుకుగాను శ్రుతి బాధపడుతుండగా తులసి ఓదారుస్తుంది. ఇక ఆఫీసుకు వెళ్లే టైం కాగా నందు, తులసి, లాస్య ఆఫీసుకు బయల్దేరుతారు. కారులో పక్క సీట్లోనే తులసి కూర్చోగా, లాస్య వెనుకాల సీటులో కూర్చుంటుంది. అలా పక్కన ఇల్లాలు, వెనుకాల ప్రియురాలితో పడరాని తిప్పలు పడుతాడు నందు. అయితే, తులసి నందు పక్కన కూర్చొని ఉండటం చూసి లాస్య మనసులో బాధపడటంతోపాటు తులసిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక శ్రుతి, ప్రేమ్ మధ్య సంభాషణలు ఆసక్తికరంగానే సాగాయి. తనకు నందు అవమానించిన సంగతి తెలిసిందని, ఏం బాధ పడొద్దని ప్రేమ్ శ్రుతికి చెప్తాడు. అయితే, శ్రుతి ఆ విషయాలను పట్టించుకోకుండా తను పెట్టిన బాక్స్‌ను అంకుల్ తీసుకెళ్లాడని ఆనందపడిపోతుంది. అంతలోనే తాకట్టు పెట్టిన చెయిన్ ప్రేమ్ శ్రుతికి పెట్టగా శ్రుతి ఆనందపడిపోతుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.