Intinti Gruhalakshmi Dec 2 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘ఇంటింటి గృహలక్ష్మీ’ సీరియల్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. తులసి ఆరోగ్యంపై కుటుంబ సభ్యలంతా టెన్షన్ పడుతున్నారు. మరో వైపు నందుతో పెళ్లి కోసం లాస్య ఆరాడపడుతుంది. ఇన్నిటెన్షన్ల మధ్య నడుస్తున్న సీరియల్లో నేటి ఎపిసోడ్ హైలెట్స్ చూసేద్దాం..
తులసి అనారోగ్యంతో బాధపడుతుండగా లాస్య వెళ్లి పలకరిస్తుంది. ఈ సీన్ చూస్తే లాస్య ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక తులసి మాత్రం ఎప్పటిలాగానే నందుతో పెళ్లి విషయం మాట్లాడావా..? ఏం చెప్పాడని రౌటిన్ ప్రశ్న అడుగుతుంది. నందు పెళ్లి విషయంలో అయోమయంలో ఉన్నాడని, ఏం సమాధానం ఇవ్వడం లేదని లాస్య బాధపడుతూ చెబుతుంది. ఆ తర్వాత మనం మంచి ఫ్రెండ్స్ ఈ గొడవలు లేకపోతే కలిసే ఉండేవాళ్లమని లాస్య అంటుంది.
మా ఆయన నువ్వు కలిసి మోసం చేశారు…
తులసి లాస్యతో మాట్లాడుతూ నేను నిన్ను మొదటి నుంచి మంచి స్నేహితురాలిగానే భావించాను. వర్క్ విషయంలో నువ్వు మా ఆయనకు సాయం చేస్తున్నావు అని అనుకున్నాను. కానీ నువ్వు నందు కలిసి నన్ను మోసం చేశారని లాస్యను చెంప మీద కొట్టినట్టు మాట్లాడుతుంది.అయినా సరే నందు అనే వ్యక్తితో నేను కలిసి ఉండలేను. తను నీతోనే కలిసి ఉంటాడు. నిన్ను పెళ్ళిచేసుకునేలా నేను ఒప్పిస్తానని చెప్పడంతో లాస్య సంతోషంగా వెళ్తుంది.
Intinti Gruhalakshmi Dec 2 Episode
నందు, అనసూయపై కృష్ణ కౌంటర్లు..
నందు వచ్చి డాక్టర్‌ను తులసి రిపోర్ట్స్ వచ్చాయా? అని అడుగుతాడు. లేదు రాగానే నేను కబురు పెడతాను. మీరు కొంచెం మీ కోపం తగ్గించుకోవాలని సూచిస్తాడు. ఆ తర్వాత మీ నాన్న ఎప్పుడూ ఇలా కోపంగానే ఉంటాడా? అని అనడంతో అభి నవ్వుతాడు. ఇలా ఇంట్లో అందరూ నవ్వుతూ ఉండి తులసిని బాగా చూసుకోవాలని చెబుతాడు కృష్ణ..
సీన్ కట్ చేస్తే.. అనసూయ, అంకిత వీరంతా తులసితో మాట్లాడుతుంటారు. మా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది తులసి అంటూ అనసూయ బాధపడుతుండగా ఇప్పటికైనా మీకు బుద్ది వచ్చిననందుకు సంతోషం.. కానీ పాత రోజులను గుర్తుచేసి ఇంకా తులసిని బాధపెట్టకండని కృష్ణ అంటాడు. డాక్టర్ గారు నేను బాగానే ఉన్నాను కదా? అని తులసి అడుగడంతో.. లేదు తులసి నువ్వు మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు.. అవన్నీ కొంచెం తగ్గించుకో.. నీకు ఏదైనా సమస్య అనిపిస్తే జై కృష్ణ అని తలుచుకో నీ ముందు వాలిపోతానంటూ చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాంటే ‘ఇంటింటి గృహలక్ష్మీ’ సీరియల్ కొనసాగుతోంది.