Intinti Gruhalakshmi Dec 6 Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి రోజు మలుపులు, ట్విస్టులతో కథ కొనసాగుతుండటంతో అందరిలోనూ ఇంట్రెస్ట్ పెరిగింది. మరి ఈరోజు (డిసెంబర్ 6, 2021)న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
అందరూ తులసికి సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు.. ప్రేమ్ కాటేజ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగా, నందు గులాబీ చెట్టు వద్దకు తీసుకుని వెళ్తాడు. తనకెంతో ఇష్టమైన ఎల్లో కలర్ గులాబీచెట్టును తీసుకొస్తాడు. తన బాధలను చిన్నప్పటి నుంచి గులాబీ చెట్టుకు చెప్పుకోవడం అలవాటని తులసి చెబుతుంది. పెళ్లి అయిన తర్వాత గులాబీ చెట్టును తన ఇంటి వద్దే వదిలేశానని చెప్పుకొచ్చింది. పెళ్లి అయ్యాక తోడు దొరికిందని అనుకున్నాను.. కానీ, ఈ మొక్క అవసరం ఉందని అనిపించిందని తులసి చెబుతుంది. ఇంతలోనే అనసూయ అక్కడకు వచ్చి తులసికి హారతి ఇస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉందంటూ అనసూయకు చెబుతుంది తులసి. పాతికేళ్ల కిందట మా ఇంటి కోడలిగా నువ్వు వచ్చినప్పుడు హారతి కూడా ఇవ్వలేకపోయాను. అందుకు ఇప్పుడు ఇస్తున్నానని చెబుతుంది అనసూయ. నేను ఇప్పుడు మీ కోడలిని కాదుకదా అని తులసి అంటుంది. అందుకు అనసూయ బదులిస్తూ నువ్వు నాకు కోడలి కంటే ఎక్కువ అని డైలాగ్ వేస్తుంది. తన చిన్నప్పటి కుట్టుమిషన్ ను చూసిన తులసి ఆశ్చర్యానికి గురవుతుంది. ఇంతలో నందు వచ్చి తులసిని విష్ చేయడంతో ఆమె షాకవుతుంది. అనంతరం తులసి అమ్మవారికి హారతి ఇచ్చి.. దానిని అందరికి ఇస్తుండగా దానిని నందు తీసుకుంటాడు. ఇది చూసిన లాస్య షాకవుతుంది.
Intinti Gruhalakshmi Dec 6 Today Episode
అందురు దిగులుగా ఉన్నారేంటి.. నాకు తెలియకుండా ఏదో విషయాన్ని దాస్తున్నారని అడుగుతుంది తులసి. కానీ లాస్య మాత్రం తనలో తానే మాట్లాడుకుంటుంది.. ఎంటిది వీళ్ల బాధ. ఇల్లు మారినప్పటికీ అదే బాధ. అదే టెన్షన్. అంతా ఒక్కటైపోయి నన్ను వదిలేస్తున్నారు అని మనసులో లాస్య అనుకుంటుంది. అందరూ బయట సరదాగా డ్యాన్సులు చేస్తుండగా నందును లోపలికి పిలుస్తుంది లాస్య. తులసి హెల్త్ కండీషన్‌ను రీజన్ గా చూపి ఆమెతో ఉందామని అనుకుంటున్నావా అంటూ అడుగుతుంది. తులసి గురించి నేను ఆలోచిస్తూనే ఉంటా. ఎందుకంటే ఆమె నా భార్య అని నందు చెప్పడంతో లాస్య కోపంతో లోపలికి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే.. తులసిని కలిసిన డాక్టర్ కృష్ణ.. ఆమెకు క్యాన్సర్ అని చెబుతాడు. దీంతో తులసి ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్ పైకి వెళుతుంది.