Intinti Gruhalakshmi December 8 Episode : విడాకుల విషయం తెలుసుకుని నందుని నిలదీసిన తులసి తల్లి!

Intinti Gruhalakshmi December 8 Episode : కొత్త కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటున్న బుల్లితెర సీరియల్ ఇంటింటి గృహ లక్ష్మి డిసెంబర్ 8 ఎపిసోడ్ లో హైలెట్స్ గురించి తెలుసుకుందాం. అకింత తల్లి అందరి ముందు కోపంగా అంకితతో ”పరువు గల కుటుంబం అని నా కూతుర్ని కోడలిగా పంపించాను.. కానీ నా బంధువుల ముందే తలదించుకుని నిలబడాల్సి వచ్చింది.. తులసి తాను చేసే పని గొప్ప త్యాగం అని అనుకుంటుంది.. కానీ అది కరెక్ట్ కాదు […].

By: jyothi

Published Date - Wed - 8 December 21

Intinti Gruhalakshmi December 8 Episode : విడాకుల విషయం తెలుసుకుని నందుని నిలదీసిన తులసి తల్లి!

Intinti Gruhalakshmi December 8 Episode : కొత్త కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటున్న బుల్లితెర సీరియల్ ఇంటింటి గృహ లక్ష్మి డిసెంబర్ 8 ఎపిసోడ్ లో హైలెట్స్ గురించి తెలుసుకుందాం. అకింత తల్లి అందరి ముందు కోపంగా అంకితతో ”పరువు గల కుటుంబం అని నా కూతుర్ని కోడలిగా పంపించాను.. కానీ నా బంధువుల ముందే తలదించుకుని నిలబడాల్సి వచ్చింది.. తులసి తాను చేసే పని గొప్ప త్యాగం అని అనుకుంటుంది.. కానీ అది కరెక్ట్ కాదు కదా.. అయినా ఇవన్నీ కాదు.. అంకిత నువ్వు నీ భర్త వేళ్ళతో కలిసి ఉండడానికి వెళ్ళేడు.. ఫారిన్ వెళ్ళడానికి ప్రయత్నించండి.. నీ మొగుడిని బ్రతిమిలాడతావో.. లేదంటే బెదిరితావో నీ ఇష్టం.. నువ్వు అయితే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు.. అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది.

ఇక అప్పుడు తులసి నందు వైపు చూస్తుంది.. ఇదంతా నీ వల్లే అనే ఉద్దేశంతో.. తులసికి నందు విడాకులు ఇవ్వబోతున్నాడని తెలిసి తులసి తల్లి కన్నీళ్లతో నందుని కలవడానికి వెళ్ళింది. ;;అత్తయ్య మీరేంటి ఇక్కడ? అని నందు కంగారుగా అడగడంతో తులసిలో పాతికేళ్ల క్రితం నువ్వు ఏం చూసి ఇష్టపడ్డావో తెలియదు.. ప్రేమిస్తున్న అన్నావ్.. తనతోనే జీవితం అని చెప్పడంతో ఇంతకన్నా ప్రేమించే భర్తను మేము తీసుకురాగలమా అని అనుకున్నాం.. నా కూతుర్ని నీకు ఇచ్చేయడమీ సరైన నిర్ణయం అనుకున్నాం.. అంత ఇష్టపడ్డవాడివి ఇప్పుడు అంతసులువుగా ఎలా విడిచి పెడుతున్నావ్? తనను ఎలా దూరం చేసుకుంటున్నావ్?

తులసి కాలంతో పరిగెత్తలేదు బాబు అందరిని చూసుకుంటూ ఎక్కడో ఆగిపోయింది. అందుకే నువ్వు కోరుకుంటున్నట్టు ఆధునికంగా మారలేకపోయింది.. కానీ పాతికేళ్లుగా నీకు నీ కుటుంబానికి సేవ చేసింది.. అందరిని కంటికి రెప్పలా కాపాడింది.. అలన్తి దాన్ని రోడ్డు మీద వదిలేస్తున్నావ్.. అంటూ నిలదీస్తుంది. అప్పుడు నందు ఏం చేయను అత్తయ్య పరిస్థితుల వల్ల అలా నడవాల్సి వస్తుంది అంటాడు బాధతో కూడిన స్వరంతో. ఏంటి బాబు పరిస్థితులు.. ప్రపంచం మొత్తం నిన్ను వ్యతిరేకించినప్పుడు తులసి నీలాగా వదిలెయ్యలేదు.. నీ కన్నవాళ్ళు కూడా నువ్వు ఏం చేయలేవు అన్నప్పుడు కూడా తులసి నిన్ను వదిలేయలేదు.

చేసిన పనిని సమర్ధించుకోకు బాబు.. ఈ వయసులో భర్త ఆదరణ లేక ఎలా బ్రతుకుతుంది? తులసి తెలియని ప్రపంచంతో ఎలా పోరాడుతుంది? అది భర్త లేడుందా తిరుగుతుంటే నాకు ఎంత గుండె కోతగా ఉంటుందో అర్ధం చేసుకో.. అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ”క్షమించండి అతయ్య..లాస్యతో చాలా దూరం వెళ్ళిపోయాను.. నేను ఇంకేం చేయలేను.. అందుకుంటాడు నందు మనసులో. నందు ఇంటికి వెళ్ళగానే లాస్య కోపంగా.. నాకు తెలియకుండా చాలా విషయాలు నడుపుతున్నవే.. తులసి వాళ్ళ అమ్మ నీ దగ్గర రాయబారం చేయడానికి వచ్చారటగా.. నాకు తెలిసి తులసినే ఆమెను పంపించి ఇలా చేపించి ఉండవచ్చు.

Intinti Gruhalakshmi Dec 8 Today Episode

Intinti Gruhalakshmi Dec 8 Today Episode


ఆ మాటలన్నీ తులసి కూడా వినేస్తుంది. నందు లాస్యతో నువ్వు భయపడాల్సిన విషయాలేమి జరగలేదు.. నన్ను ఒంటరిగా వదిలెయ్యి అంటాడు. తులసి తన తల్లికి విషయం తెలిసిందని చాలా బాధ పడుతుంది. కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్లిపోతుంటే నందు తులసిని చూసి వెనకే వెళ్తాడు. తులసి మెట్లపై కూర్చుని బాధపడుతుంటే నామూలంగా బాధపడుతున్నావా తులసి అని అడగగా.. బాధపడడం, బాధలోనుండి బయట పడడం అలవాటు అయిపోయింది.. అంటుంది తులసి.

అప్పుడు నందు ఈ రోజు మీ అమ్మగారు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు.. నీ విషయంలో చాలా బాధపడుతున్నారు తులసి అంటాడు. నేను అన్యాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు.. ఆవిడ ఆవేదన చూసాక మీరంతా బాధపడేంత తప్పు చేసానా అని.. నాకు నేనే ఒక దోషిలాగా కనిపిస్తున్నాను అంటాడు. నా తల్లికి తెలిస్తే ఇదే జరుగుతుందని నాకు తెలుసు.. అందుకే నేను చెప్పకుండా దాచి పెట్టాను..అంటూ తులసి బాధపడుతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.

Tags

Latest News

Related News