intinti gruhalakshmi december7 episode :ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ చాలా మంది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ సీరియల్ కూడా నెమ్మదిగా ఎక్కువ రేటింగ్ సంపాధించుకుంటూ దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో తులసి పాత్ర అచ్చం మధ్య తరగతి కుటుంబంలో ఇల్లాలిలాగే ఉందని చాలా మంది అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ సీరియల్ విలన్ అయిన లాస్య వేసే ఎత్తులు, పై ఎత్తులతో ఈ సీరియల్ చాలా ఆసక్తికరంగా మారుతోంది.
తనను పెళ్లి చేసుకోమని లాస్య నందూని ఒకటే టార్చర్ పెడుతుంది. ఇదిలా ఉండగానే నందు తల్లిదండ్రులయిన పరంధమయ్య, అనసూయమ్మ తమ బ్యాగులను సర్దుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నారు నాన్నా అని నందూ వారిని అడుగుతాడు. దీనికి వారు ఇక్కడ మేము ఉండలేం. లాస్యకు నీకూ జరిగే గొడవలను చూడలేం అందుకోసమే తులసి ఉండే కాటేజ్ కి వెళ్తున్నాం అని చెబుతారు. పిల్లలకు కూడా ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు కానీ వారు నీతో చెప్పేందుకు మొహమాట పడుతున్నారు. అని అనసూయమ్మ చెబుతుంది. ఇక తులసి ఉండే కాటేజ్ కి వెళ్లి వారంతా తులసితో సరదాగా నవ్వుతూ గడుపుతారు.
Intinti Gruhalakshmi Dec 7 Today Episode
ఇక ఇలా ఉండగా.. తులసి పొద్దున్నే లేచి పూల కోసమని వెల్నెస్ సెంటర్ కు వెళ్తుంది. అక్కడ ఉన్న పూలు తులసికి విపరీతంగా నచ్చుతాయి. కానీ ఎవర్ని అడగాలో మాత్రం తులసికి ఎంతకూ అర్థం కాదు. అక్కడ కూడా ఎవరూ కనిపించరు. ఎవర్నైనా అడుగుదామంటే ఎవరూ కనిపించడం లేదే? అని తులసి ఆలోచిస్తుండగా అక్కడికి కృష్ణ వస్తాడు. తులసి గారు మీకు కావలసినన్ని పూలను కోసుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ ఏమనరు. అని చెబుతాడు. దీంతో తులసి ఆ పూలు కోసుకునేందుకు సిద్ధపడుతుంది. ఇదిలా ఉండగా.. కృష్ణ తులసితో నేను మీకు ఇంతలా సాయం చేస్తున్నా కానీ మీరు నన్ను ఒక్కసారి కూడా మీ ఇంటికి ఆహ్వానించలేదని అడుగుతాడు. దానికి తులసి అయ్యో అని కృష్ణను తమ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు ఇంటిలో తమ అత్తయ్య, మామయ్య కూడా ఉన్నారని మీరు వస్తే చాలా ఆనందపడతారని అంటుంది. ఇక అప్పుడే డాక్టర్ కృష్ణ తులసికి క్యాన్సర్ అనే విషయాన్ని చెబుతాడు. దీంతో తులసి ఒక్కసారిగా షాక్ కు గురవుతుంది. ఇక ఇంట్లోని వారంతా తులసికి క్యాన్సర్ అనే విషయం ఎలా చెప్పాలని మదనపడుతూ ఉంటారు. కొంపదీసి డాక్టర్ కృష్ణ తులసికి అసలు విషయం చెప్పేస్తే కొంపలు మునుగుతాయని భయపడతారు. ఇక తనకు క్యాన్సర్ అనే విషయం తెలుసుకున్న తులసి ఏం చేసిందనేది తర్వాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.