Intinti Gruhalakshmi Nov 10th Episode : హోటల్లో ఒకే గదిలో నందు, తులసి.. శృతికి ఘోర అవమానం..

Intinti Gruhalakshmi Nov 10th Episode : బుల్లితెర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నవంబర్ 10వ తేదిన 473 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. అందులోని హైలైట్స్ ఇప్పుడు చూసేద్దాం.. ఆఫీస్ పని మీద నందు, తులసి బెంగళూరు వెళ్లడంతో లాస్య టెన్షన్ పడుతుంది. నా వళ్ల కాదు.. నెక్ట్స్ ఫ్లైట్ కే నేను కూడా బెంగళూరు వెళ్తా అనడంతో నందు మీద నీకు నమ్మకం లేదా అని తులసి అంటుందని భాగ్య అనడంతో […].

By: jyothi

Published Date - Wed - 10 November 21

Intinti Gruhalakshmi Nov 10th Episode : హోటల్లో ఒకే గదిలో నందు, తులసి.. శృతికి ఘోర అవమానం..

Intinti Gruhalakshmi Nov 10th Episode : బుల్లితెర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నవంబర్ 10వ తేదిన 473 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. అందులోని హైలైట్స్ ఇప్పుడు చూసేద్దాం.. ఆఫీస్ పని మీద నందు, తులసి బెంగళూరు వెళ్లడంతో లాస్య టెన్షన్ పడుతుంది. నా వళ్ల కాదు.. నెక్ట్స్ ఫ్లైట్ కే నేను కూడా బెంగళూరు వెళ్తా అనడంతో నందు మీద నీకు నమ్మకం లేదా అని తులసి అంటుందని భాగ్య అనడంతో లాస్య ఆగిపోతుంది. వెంటనే నందు లాస్యకు కాల్ చేసి ఈ రోజు మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది.. రేపు ఉందని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

ఈ రోజు మీటింగ్ లేదట.. ఇద్దరూ వేర్వేరు గదులు తీసుకున్నారని లాస్య భాగ్యకు చెప్పగానే.. అలా ఎలా నమ్ముతావు, మీ ఆయన అబద్దం చెప్పి ఉండవచ్చు కదా అని భాగ్య మరో డౌట్ క్రియేట్ చేస్తుంది. ఇక నందు హోటల్‌కు వెళ్లగా అక్కడ ఇద్దరికీ కలిపి ఒకే రూమ్ ఇస్తారు.

దీంతో నందు.. తులసి నువ్వు ఇక్కడే ఉండు. నేను వేరే హోటల్లో ఉంటాను.. ఉదయాన్ని వచ్చి నిన్ను పికప్ చేసుకుంటానని చెప్పడంతో తులసి.. మన మధ్య బంధం మాత్రమే దూరమైంది. నమ్మకం కాదు.. ఇద్దరం ఒకే రూమ్‌లో ఉంటే నాకు ఏమి ఇబ్బంది లేదు అంటుంది.

Intinti Gruhalakshmi 10 Nov Today Episode-2

Intinti Gruhalakshmi 10 Nov Today Episode-2

సీన్ కట్ చేస్తే.. అంకిత కొత్ నెక్లెస్ చూస్తూ మురిసిపోతుంటుంది. అభి వచ్చి ఎవరిచ్చారు అని అడగటంతో మా అమ్మ ఇచ్చిందని చెప్పగా.. వెంటనే దానిని మీ వాళ్లకు ఇచ్చేయ్.. వాళ్లు మీ ఇంట్లో నాకు చేసిన అవమానాన్ని మర్చిపోయావా అంటూ సీరియస్ అవుతాడు అభి. దీంతో అంకిత నేను కూడా మా ఇంటికి వెళ్లిపోవాలా? అంటూ సెంటిమెంట్ డైలాగ్ కొట్టగా.. అభి వెంటనే అంకితకు సారీ చెబుతాడు. తనను పబ్‌కు తీసుకెళ్లాలని కోరుతుంది అంకిత.

శృతిని అవమానించిన అంకిత

శృతి వచ్చి బావ గారు మీకు కొరియర్ వచ్చిందని చెబుతుంది. ఆ నెక్లెస్ చూసి బాగుంది, ఎక్కడిది అని అడుగగా మా అమ్మవాళ్లు ఇచ్చారు. నువ్వు అనాధవు కదా.. నీకు ఎవరు కొనిస్తారు. అని శృతిని అవమానిస్తుంది అంకిత. ఇకపోతే నందు, తులసి ఒకే గదిలో ఉంటారు. ఇంతలో తులసికి శృతి కాల్ చేస్తుంది. నన్ను అప్పుడే మరిచిపోయారా..? అనడంతో అదేం లేదమ్మా అంటుంది తులసి.. దివ్య ఫోన్ లాక్కుని బెంగళూరు మొత్తం చూసి రండని తులసికి చెప్పడంతో సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మరో ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

Tags

Latest News

Related News