• Telugu News
  • movies

Intinti Gruhalakshmi Nov 12th episode : లాస్య మాటలకు అనసూయకు ఫ్యూజులు ఔట్‌.. తులసి మీద నందు ఫైర్ 

Intinti Gruhalakshmi Nov 12th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ నవంబర్ 12వ తేదిన 475వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులోని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం.. తులిసితో నందు కోపంగా.. ఏంటీ నా కంపెనీలో ఉండిపోదాం అనుకుంటున్నావా? మీటింగ్‌కు కూడా వస్తావా? అని రగిలిపోతాడు. తులసి కోపంగా నేను రాను, మీరే వెళ్లండని అనడంతో ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటాడు నందు. అయినా, నాకు ఇపుడు ఆత్మాభిమానం ముఖ్యం అని […].

By: jyothi

Updated On - Fri - 12 November 21

Intinti Gruhalakshmi Nov 12th episode : లాస్య మాటలకు అనసూయకు ఫ్యూజులు ఔట్‌.. తులసి మీద నందు ఫైర్ 

Intinti Gruhalakshmi Nov 12th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ నవంబర్ 12వ తేదిన 475వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులోని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం.. తులిసితో నందు కోపంగా.. ఏంటీ నా కంపెనీలో ఉండిపోదాం అనుకుంటున్నావా? మీటింగ్‌కు కూడా వస్తావా? అని రగిలిపోతాడు. తులసి కోపంగా నేను రాను, మీరే వెళ్లండని అనడంతో ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటాడు నందు.

అయినా, నాకు ఇపుడు ఆత్మాభిమానం ముఖ్యం అని చెప్పి వెళ్లిపోతుంది తులసి. సరిగ్గా అప్పుడే లాస్య కాల్ చేసి ఎక్కడున్నావ్ ? ఎవరితో ఉన్నావ్? అని నందును విసిగించగా.. మాటి మాటికీ ఇలా నువ్వు అనుమానిస్తే బాగోదు అని కాల్ కట్ చేస్తాడు నందు. ఇంతలో అనసూయ బాధతో అమ్మా లాస్య త్వరగా అని అరుస్తుంది.

కారణం ఆమె కాలు మీద వేడి టీ ఒలకడమే. వెన్నపూస తీసుకుని లాస్య విసుక్కుంటూ వెళ్లి సేవలు చేస్తుండగా.. అమ్మా దీనితో తగ్గదు.. గదిలో మాత్రలు ఉన్నాయి తేవాలని చెబుతుంది. ఈలోపే లాస్యకు భాగ్య కాల్ చేసి తులసి నందు కలిసిపోతారు.. జీవితంలో నువ్వు ఓడిపోతావు అంటూ అనడంతో లాస్య మరింత రగిలిపోతుంటుంది.

Intinti Gruhalakshmi November 12 Episode-1

Intinti Gruhalakshmi November 12 Episode-1

లాస్య మాటలు విని షాకైన అనసూయ..

లాస్య ఎంతకూ రాకపోవడంతో నెమ్మదిగా ఆమె రూమ్ వద్దకు వస్తుంది అనసూయ.. భాగ్యతో లాస్య అంటున్న మాటలు విని షాక్ అవుతుంది. ఈ ముసలిది బతికి ఎవరిని ఉద్దరిస్తుందో.. చస్తే బాగుండు అని లాస్య అనడంతో ఫ్యూజులు ఎగిరిపోతాయ్ అనసూయకు. నా పెళ్లి అవ్వగానే ఈ ముసలి బ్యాచ్‌ను ఓల్డేజ్ హోమ్‌‌లో చేరుస్తాను అనడంతో.. దీనికోసమా నేను నా కుటుంబంతో ఎదురించింది అని అనసూయ బాధపడుతుంది. పరందామయ్య తులసితో మాట్లాడుతూ..మీ అత్తయ్యకు కాలు కాలిందని చెప్పగా.. తులసి తన అత్తతో ప్రేమగా మాట్లాడుతుంటే అనసూయ కళ్లలో నీళ్లు తిరుగుతాయి.

తులసిని ప్రేమగా పిలిచిన అనసూయ

కాల్ కట్ చేసే సమయంలో తులసి.. అని ప్రేమగా పిలుస్తుంది అనసూయ.. ఏంటి అత్తయ్యా అనగా జాగ్రత్త అమ్మా అంటుంది అనసూయ. ఈ మాటలు విని తులసి చాలా సంతోష పడుతుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అనసూయ కళ్లలో నీళ్లను చూసిన భర్త పరందామయ్య మాత్రం ఈ కన్నీళ్లు నీ గాయం వలన కలిగే నొప్పి నుంచి వచ్చినట్టు నాకు అనిపించడం లేదే.. పశ్చాత్తాపంతో వచ్చినట్టు కనిపిస్తోందని అంటాడు భార్యతో.. తర్వాత లాస్య మాత్రలు తెచ్చి ఇవ్వగా అక్కడ పెట్టి వెళ్లు అంటుంది అనసూయ.. తర్వాత ఏం జరిగిందో తెలియాంటే ఇంటింటి గృహలక్ష్మీ కొనసాగుతోంది.

Tags

Related News