Intinti Gruhalakshmi Nov 15 Episode:బుల్లితెర ప్రేక్షకులను ‘ఇంటింటి గృహలక్ష్మి’సీరియల్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్‌లో జరిగిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆనందింపజేశాయని తెలిసింది. నవంబరు 15వ తేదిన ఏం జరిగిందో హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి టీ తెచ్చి ఇస్తున్న సమయంలో నందు లాస్యతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వీడియోలో తులసి కనిపించగానే ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారా? అని నానా రచ్చ చేస్తుంది లాస్య. కంపెనీ వాళ్లు మిస్టేక్‌లో రెండు రూములు ఇవ్వాల్సింది ఒకే గది ఇచ్చారని నందు చెబుతుంటే లాస్య వినిపించుకోదు. తులసి చెప్పబోతున్నా మధ్యలో నువ్వు మాట్లాడకు అంటూ సీరియస్ అవుతుంది. దీంతో నందుకు చీరాకు వేసి కాల్ కట్ చేస్తాడు. ఇంతలో తులసి కళ్లు తిరిగి కింద పడబోతుంటే నందు పట్టుకుని బెడ్ పై పడుకోబెట్టి సపర్యలు చేస్తాడు. డాక్టర్ను పిలవాలా? అని అడి పండ్లు తెచ్చి తినమని ఇస్తాడు.
లాస్య పెరిగిన టెంపర్.. ఇంటిళ్లి పాదితో గొడవ
సినిమాకు వెళ్లి సీన్ల గురించి మాట్లాడుకుంటూ వస్తున్న కుటుంబసభ్యులతో లాస్య గొడవకు దిగుతుంది. మీకు బాధ్యత లేదా ముసలివాళ్లను అలా వదిలేసి వెళ్తారా? అంటూ కోపం తెచ్చుకోవడంతో ఏమైందని వాళ్లు అడుగుతారు. టీ పెట్టే క్రమంలో వేడి వేడి టీ కాళ్ల పడి అనసూయ ఆంటీ ఎంత బాధపడుతుందో తెలుసా.. టైంకు ఇంట్లో ఎవరూ లేరు.
Intinti Gruhalakshmi November 15 Episode-2
సమయానికి ఇంట్లో ఎవరూ లేరు.. అంకిత.. ఈ ఇంటి పెద్ద కోడలు నువ్వే ఇవన్నీ చూసుకోవాలి కదా అనడంతో.. నువ్వు కూడా ఈ ఇంటికి కోడలివి కాబోతున్నావు కదా.. నువ్వు చేయకుండా నన్ను ఎందుకు అంటున్నావ్ అని పంచ్ ఇస్తుంది అంకిత.. ఇంతలో పరంధామయ్య వచ్చి లాస్య ఏంటీ నీ ప్రాబ్లం.. చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు అంటూ కోప్పడతాడు.
నందుకు టై కడుతూ దొరికిపోయిన తులసి..
ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్న టైంలో టై కట్టుకోవడానికి నందు ఇబ్బందిపడుతాడు. ఏమైందండి అనగా బాత్ రూం డోర్‌లో వేలు ఇరుక్కుపోయిందని నందు చెప్పగా తులిసి టై కట్టేందుకు సాయం చేస్తుంది. అంతలో లాస్య లాప్ ట్యాప్ నుంచి వీడియో కాల్ చేయగా, కట్ చేయబోయి లిఫ్ట్ చేస్తాడు నందు.. తులసి నందుకు దగ్గరగా ఉండటాన్ని చూసిన లాస్య గట్టిగా అరుస్తుంది. తులసి అసలు విషయం చెప్పబోతుంటే లాస్య అస్సలు వినిపించుకోదు. నానా గొడవ పెడుతుంటే నందు వెంటనే కాల్ కట్ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ కొనసాగుతోంది.