Intinti Gruhalakshmi Nov 17 today Episode : కిందపడిపోయిన తులసి.. భాగ్య చెంప చెల్లుమనిపించిన లాస్య..

Intinti Gruhalakshmi Nov 17 today Episode : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక ఈ రోజు (నవంబర్ 17, 2021)న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం.తులసిని గుర్తుచేసుకుంటూ ఆమె ఫొటోను పట్టుకుని ఏడుస్తుంటుంది అనసూయ. నువ్వు మంచిదానివి అని నీకు వెంటనే ఫోన్ చేసి సారీ చెబుతానని అనుకుంటుంది అనసూయ. అనంతరం తులసికి ఫోన్ చేస్తుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసిన తులసి.. […].

By: jyothi

Updated On - Wed - 17 November 21

Intinti Gruhalakshmi Nov 17 today Episode : కిందపడిపోయిన తులసి.. భాగ్య చెంప చెల్లుమనిపించిన లాస్య..

Intinti Gruhalakshmi Nov 17 today Episode : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక ఈ రోజు (నవంబర్ 17, 2021)న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం.తులసిని గుర్తుచేసుకుంటూ ఆమె ఫొటోను పట్టుకుని ఏడుస్తుంటుంది అనసూయ.

నువ్వు మంచిదానివి అని నీకు వెంటనే ఫోన్ చేసి సారీ చెబుతానని అనుకుంటుంది అనసూయ. అనంతరం తులసికి ఫోన్ చేస్తుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసిన తులసి.. అత్తయ్యా.. మీరేనా నాకు ఫోన్ చేసింది. నమ్మలేకపోతున్నా.. అంటూ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అదే టైంలో తులసికి కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంది. అయినా ఆమె ఫోల్ లో మాట్లాడుతూనే ఉంటుంది.

నేను నీతో మాట్లాడేందుకు ఫోన్ చేశాను అంటూ అనసూయ చెబుతుంది. నా కోడలితోనే మాట్లాడేందుకు కాల్ చేశాను అని సెంటిమెంట్ డైలాగ్ కొడుతుంది అనసూయ. ఇక అనసూయ మాటలకు ఆనందపడుతున్న తులసికి కళ్లు తిరుగుతాయి. దీంతో తనకు కళ్లు తిరుగుతున్నాయని అనసూయకు చెబుతూ కిందపడిపోతుంది తులసి. అది విన్న అనసూయ ఏడుస్తుండగా ఇంట్లో వారంతా అక్కడికి వస్తారు. ఏంటని ప్రశ్నిస్తారు. ఇందుకు అనసూయ సమాధానమిస్తూ తులసి కళ్లు తిరిగి కింద పడిపోయిందని చెబుతుంది అనసూయ. ఈ మాటలు విన్న లాస్య కాస్త షాక్‌కు గురవుతుంది.

Intinti Gruhalakshmi November 17 Episode -2

Intinti Gruhalakshmi November 17 Episode -2

అప్పుడు బయటి నుంచి వస్తున్న నందు.. తులసిని చూసి కంగారుకు ఆమె లేపి బెడ్ పైన పడుకోబెడతాడు. అనంతరం డాక్టర్ కు కాల్ చేస్తాడు. ఇక అక్కడికి వచ్చిన డాక్టర్ తులసిని చెక్ చేసి టాబ్లెట్స్ ఇస్తుంది. మార్నింగ్ టైంలో ఓ సారి హాస్పిటల్ కు తీసుకురావాలని చెబుతుంది. ఒత్తిడి పెరగడం వల్లే ఇలా జరిగిందని చెబుతుంది డాక్టర్. ఇక తులసి పడిపోవడంతో ప్రేమ్, పరంధామయ్య, అనసూయ టెన్షన్ పడుతుంటారు. అదే టైంలో నందుకు ఫోన్ చేస్తాడు ప్రేమ్. తులసి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటాడు.

తులసి, నందు విషయమై మాట్లాడుకుంటూ కంగారు పడుతుంటారు లాస్య, భాగ్య. రాత్రికి నందు వచ్చిన తర్వాత మ్యారేట్ విషయం గురించి తెల్చేద్దామని అంటుంది లాస్య. కానీ తులసి వల్ల ఇంకా లేట్ అవుతుంది అని చెబుతుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు లాస్య.. నువ్వు బావ ఒకటయితే ఓకే.. లేదంటే తులసి, బావ ఒకటయితే నువ్వు వేరే వారికి పెళ్లి చేసుకుంటావు అంటూ చెబుతుంది భాగ్య. దీంతో కోపానికి గురైన లాస్య.. భాగ్యను చెంపపై కొడుతుంది. నందు నా ప్రాణమని చెబుతుంది లాస్య. నందు తన నా లైఫ్‌లో మొదటి ఆప్షన్ అని, తమ మధ్యలోకి ఎవరు వచ్చినా ఊరకోబోనని చెబుతుంది లాస్య.

Tags

Related News