• Telugu News
  • movies

Intinti Gruhalakshmi Nov 18 Episode : నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని నందును నిలదీసిన లాస్య.. 

Intinti Gruhalakshmi Nov 18 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ చాలా ఆసక్తిగా సాగుతోంది. ఈ ఎపిసోడ్‌లో తులసికి నందును దూరం చేయడానికి లాస్య ఏం చేసిందో తెలియాలంటే హైలెట్స్ చూడాల్సిందే.తులసి కళ్లు తిరిగి పడిపోయిందని తెలియగానే ఫ్యామిలీ మెంబర్స్ తెగ కంగారుపడుతుండగా.. లాస్య బయట భాగ్యతో మాట్లాడుతూ తెగ ఫీల్ అవుతుంటుంది. ఈరోజు ఎలాగైనా నందు రాగానే నా పెళ్లి గురించి అందరి ముందు పంచాయితీ పెట్టాలని భాగ్యతో అంటుంది […].

By: jyothi

Updated On - Thu - 18 November 21

Intinti Gruhalakshmi Nov 18 Episode : నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని నందును నిలదీసిన లాస్య.. 

Intinti Gruhalakshmi Nov 18 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ చాలా ఆసక్తిగా సాగుతోంది. ఈ ఎపిసోడ్‌లో తులసికి నందును దూరం చేయడానికి లాస్య ఏం చేసిందో తెలియాలంటే హైలెట్స్ చూడాల్సిందే.తులసి కళ్లు తిరిగి పడిపోయిందని తెలియగానే ఫ్యామిలీ మెంబర్స్ తెగ కంగారుపడుతుండగా..

లాస్య బయట భాగ్యతో మాట్లాడుతూ తెగ ఫీల్ అవుతుంటుంది. ఈరోజు ఎలాగైనా నందు రాగానే నా పెళ్లి గురించి అందరి ముందు పంచాయితీ పెట్టాలని భాగ్యతో అంటుంది లాస్య. అలా చేసినపుడు తులసి కళ్లు తిరిగిపడిపోతే తులసి అందరి సింపతీ కొట్టేస్తుందని అనడంతో అవును.. నిజమే.. అది అసలే డ్రామా క్వీన్ ఎలాగైనా నాకు అడ్డం పడుతుందని లాస్య భయపడుతుంది.


నందు దగ్గర డబ్బు లేదు కదా లాస్య..

లాస్య బావ గారు నిన్ను కావాలనుకుంటే ఒక్కటవుతారు లేదంటే నువ్వు వేరే దారి చూసుకోవాలని భాగ్య అనడంతో లాగిపెట్టి కొడుతుంది లాస్య.. ఇంకొసారి పొరపాటున కూడా ఇలా మాట్లాడవద్దని కోపంగా అంటుంది లాస్య. నందు నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం.. అతన్ని తప్పా వేరే వాళ్లను పెళ్లి చేసుకోలేనని చెబుతుంది లాస్య. ఒకవేళ నందు తులసికి దగ్గరయ్యే రోజు వస్తే అప్పుడే తేల్చుకుంటానని కూడా అంటుంది. ఒకప్పుడు బావ గారు బాగా డబ్బు సంపాదించారు.

Intinti Gruhalakshmi November 18 Episode -2

Intinti Gruhalakshmi November 18 Episode -2

ఇప్పుడేమో ఫుల్లుగా అప్పుల్లో కూరుకుపోయారు. నీ ప్రేమ డబ్బును చూసే పుట్టిందిగా, మరీ ఇపుడు దూరం కదా అని భాగ్య అనడంతో నువ్వు చెప్పింది నిజమే. కానీ నందును నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాక చాలా దగ్గరయ్యారు. నందు కనిపించకపోతే ఉండలేకపోతున్నాను.. ప్రేమలో ఉన్నప్పుడు డబ్బుకంటే మనిషే ముఖ్యమని అంటుంది లాస్య. నాకు నందుకు ఒరిజినల్ గా పెళ్లికాకపోయినా అన్ ఆఫీషియల్‌గా మాకు మ్యారేజ్ అయిపోయిందని భాగ్యతో అంటుంది లాస్య.


నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ఇప్పుడే చెప్పు నందు..

మరుసటి రోజున నందు, తులసి ఇంటికి రాగానే లాస్య ఇంట్లో అందరిని పిలిచి ఈ ఇంట్లో నా వాల్యూ ఏంటీ? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అని నందును నిలదీస్తుంది లాస్య. అందరి ముందు ఇప్పుడే చెప్పాలి. మళ్లీ నాకు అవకాశం రాదు. ఇంక వాయిదా వేయడం కుదరదు అని లాస్య గట్టిగట్టిగా అరుస్తుంటుంది. ఇది సీక్రెట్‌గా చెప్పాల్సిన విషయం అసలే కాదు. ఓపెన్‌గా అందరి ముందు తేలాల్సిన విషయం అని అనేస్తుంది లాస్య. తులసి ప్రేమకు ఇప్పుడిప్పుడే నందు దగ్గరవుతుండగా లాస్య అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో తెలీక మౌనంగా నిలబడతాడు నందు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ కొనసాగుతోంది.

Tags

Latest News

Related News