Intinti Gruhalakshmi Nov 19 Episode :నాలుక ఛీరేస్తా అంటూ లాస్యపై అనసూయ ఫైర్.. తులసిని మళ్లీ పెళ్లిచేసుకోవాలని డిమాండ్..!

Intinti Gruhalakshmi Nov 19 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘ఇంటింటి గృహలక్ష్మీ’చాలా ఆసక్తిగా సాగుతోంది. నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్‌కు సంబంధించిన హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం.. బెంగళూరు నుంచి నందు, తులసి రాగానే అనసూయ వారిని ప్రేమగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంతలో లాస్య వచ్చి నందు ఈ ఇంట్లోనే నేను ఏంటో, నా వాల్యూ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటుంది. ఇన్నిరోజులుగా ఎదరుచూశాను, ఇక చూడను, నన్ను అందరూ నానా మాటలు అంటున్నారు […].

By: jyothi

Published Date - Fri - 19 November 21

Intinti Gruhalakshmi Nov 19 Episode :నాలుక ఛీరేస్తా అంటూ లాస్యపై అనసూయ ఫైర్.. తులసిని మళ్లీ పెళ్లిచేసుకోవాలని డిమాండ్..!

Intinti Gruhalakshmi Nov 19 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘ఇంటింటి గృహలక్ష్మీ’చాలా ఆసక్తిగా సాగుతోంది. నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్‌కు సంబంధించిన హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం..

బెంగళూరు నుంచి నందు, తులసి రాగానే అనసూయ వారిని ప్రేమగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంతలో లాస్య వచ్చి నందు ఈ ఇంట్లోనే నేను ఏంటో, నా వాల్యూ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటుంది. ఇన్నిరోజులుగా ఎదరుచూశాను, ఇక చూడను, నన్ను అందరూ నానా మాటలు అంటున్నారు అని గట్టిగా అరుస్తుంది. వాళ్లు ఇప్పుడే వచ్చారుగా ఎందుకు విసిగిస్తున్నావ్ అని పరంధామయ్య గారు అనగా, ఇప్పుడే తేలాలి. ఇక నో పోస్టుపోన్ మెంట్స్ అంటూ వారిస్తుంది లాస్య. మా నాన్నకు ఆలోచించడానికి కనీసం టైం కూడా ఇవ్వవా అంటూ ప్రేమ్ ఫైర్ అవుతాడు. చూశావా నందు నీ ముందే నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటని కింద పడి బోరున విలపిస్తుంది లాస్య.

తులిసి ఆగు.. నందును మళ్లీ చేసుకో..

ఈ గొడవ జరుగుతుండగా తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఆగు.. ఎక్కడకు వెళ్లిపోతున్నావ్ అని ఆపుతుంది అనసూయ. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే వెళ్తున్నా అని అనడంతో మీ ఇద్దరూ విడాకులు తీసుకున్నా నీ మెడలో తాళి ఎందుకుంది? నువ్వు నా కొడును కంట్రోల్ లో పెట్టకపోవడం వల్లే ఇదంతా జరిగింది. నందును మళ్లీ పెళ్లి చేసుకో తులసి అనడంతో అంతా షాక్ అయిపోతారు అనసూయ మాటలు విని..

intinti gruhalakshmi 19 nov

intinti gruhalakshmi 19 nov

ఆంటీ మీరు కూడా తులసికి సపోర్టు చేస్తారా..? అంటూ లాస్య అడుగగా.. నోరు ముయ్యవే! నీ నాలుక చీరేస్తా… ఇన్నాళ్లు నీ కపట ప్రేమను నమ్మి మోసపోయా.. నా కోడలిని బాధ పెట్టి నేను చాలా బాధపడ్డాను. తులసి నన్ను క్షమించు, ఇప్పటికైనా ఎదురు తిరిగి మాట్లాడు, నీకు నేనుంటాను తోడుగా…నీ మంచి తనం వల్లే నా కొడుకు ఇలా తయారయ్యాడు అంటుంది అనసూయ.

పెళ్లి చేసుకుంటా.. పంతులును పిలువు లాస్య..

మేమింకా జీవితంలో కలవమని నాకు అర్థమైంది అత్యయ్యా అని తులసి అనడంతో విన్నావు కదా నందు.. తులసికి క్లారిటీగా ఉంది. ఇప్పుడే చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అనేస్తుంది లాస్య. ప్రేమ్ మాటలు, అనసూయ, తులసి మాటలు విన్న నందు ఇక లాస్యను పైకి లేపి పంతులును పిలువు చేసుకుందాం పెళ్లి అంటాడు. నాకు ఎలా విలువ ఇస్తున్నారో లాస్యకు కూడా అలానే ఇవ్వాలని చెప్పడంతో సరే మంచిది అని తులసి అక్కడినుంచి వెళ్లిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాంటే.. ఇంటింటి గృహలక్ష్మి కొనసాగుతుంది..

Tags

Latest News

Related News