Intinti Gruhalakshmi Nov 20 today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ స్పెషల్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవుతూ ఎప్పటికప్పుడు ట్విస్టులతో కథ ముందుకు సాగుతుంది. మరి ఈ రోజు (నవంబర్ 20, 2021)న ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం..
లాస్యను పెళ్లి చేసుకుంటానంటూ నందు చెప్పడంతో ఇంట్లోని వారంతా టెన్షన్ పడుతుంటారు. అదే టైంలో తులసి ఎంట్రీ ఇస్తుంది. అందరూ ఎందుకలా ఉన్నారు అని తులసి అడుగుతుంది. పరంధామయ్య మాట్లాడుతూ నీకేం బాధ లేదా అని తులసిని అడుగుతాడు. బాధ ఎందుకు.. వారి పాట్లు వారిని పడనివ్వండి అంటూ తులసి చెబుతుంది. ఎవరినీ బలవంతంగా జీవితంలో ఉంచుకోలెం. జరగబోయే వాటి గురించి బాధపడి ప్రయోజనం ఉండదు అని తులసి అంటుంది.
Intinti Gruhalakshmi Nov 20 today Episode-1
ఇక ఫ్రేమ్, అభి కలుగజేసుకుని నాన్నని ఇప్పడు ఆపలేకపోతే ఇక ఎప్పటికీ మన చేతుల్లోకి రాలేరు అని చెబుతాడు. ఇందుకు తులసి కాస్త ఫీల్ అవుతూ కలవాలనే ఆశ మాకు లేదు. కానీ మీరు మమ్మల్ని ఎందుకు కలపాలని చూస్తున్నారు. నా కుటుంబం కోసం నేను బతకాలని అనుకుంటున్నా.. నా జీవితం ఇదే.. పోగొట్టుకున్న దానిని గుర్తుచేస్తూ నన్ను బాధపెట్టకండంటూ అక్కడి నుంచి తులసి వెళ్లిపోతుంది. ఇక లాస్య తన కొడుకును తీసుకుని వస్తుంది.
నువ్వు ఉండాల్సింది ఈ ఇంట్లోనే లక్కీ.. అంటూ తన కొడుకుకు చెబుతుంది. అనంతరం లక్కీ.. తులసిని దగ్గరకు వెళతాడు. అతన్ని చూసిన తులసి ఆనందిస్తుంది. అనంతరం నందు దగ్గరికి వెళ్లిన లాస్య.. నీకు సర్‌ప్రైజ్.. చూడు అంటూ లక్కీని చూపిస్తుంది. లక్కీ.. ఇతనే మీ డాడీ అంటూ చెబుతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్క సారిగా షాకవుతారు. నందు సైతం సీరియస్ అవుతాడు. అతడు అంకుల్ కదా.. డాడీ ఎలా అవుతాడని లక్కీ.. ప్రశ్నిస్తాడు. డాడీ అని పిలిస్తే నాలుక కోస్తానంటూ లక్కీకి నందు వార్నింగ్ ఇస్తాడు. మనం భర్యాభర్తలం అయితే వాడికి నువ్వు తండ్రివి అవుతావుగా అంటూ చెబుతుంది లాస్య.
ఇక తులసి కలుగుజేసుకుని సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదని.. మిమ్మల్ని డాడీ అని పిలువకుండా ఇంకేమని పిలుస్తాడని ప్రశ్నిస్తుంది. లాస్య అన్నమాటల్లో వాస్తవం ఉందని.. లక్కీని మీ కొడుకుగా అంగీకరించాలని తులసి చెబుతుంది. దీంతో సీరియస్ అయిన నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో డాడీకి నేను నచ్చలేదంటూ బాధపడతాడు లక్కీ. అతన్ని లాస్య బుజ్జగిస్తుంది. ఇక తర్వాత ఏం జరిగిందనేది తరువాతి ఎపిసోడ్ లో చూద్దాం.