Intinti Gruhalakshmi Nov 25 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ చాలా ఆసక్తిగా సాగుతోంది. నందు ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పడంతో తన కొడుకుని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్దపడగా.. తన భర్తతో పెళ్లి జరిపిస్తానని లాస్యకు మాటిస్తుంది తులసి.. ఇక ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం..
తండ్రి పరంధామయ్యతో నందు ఫోన్ మాట్లాడుతుండగా వారి మాటలు చాటుగా విన్న లాస్య.. ఎలాగైనా ఈ రోజు పెళ్లి గురించి నందుతో
తేల్చుకోవాలని అనుకుంటుంది. పంతులు గారితో మాట్లాడాను. రేపు మంచి ముహూర్తిం ఉందట.. పెళ్ళి చేసుకుందామని అనడంతో ఇప్పుడు నేను చేసుకోలేను అని అంటాడు నందు.
పెళ్లి చేసుకోవడానికి మొన్న ఒకే చెప్పావు కదా! అనడంతో ఇప్పుడు వద్దంటాడు నందు. నేను నీకు కరెక్ట్ కాదని నువ్వు అంకుల్‌తో చెప్పడాన్ని నేను భరించలేకపోతున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందేనని లాస్య కోపంగా అనడంతో నేను చేసుకోను ఏం చేసుకుంటావో చేసుకో అని నందు అనేస్తాడు. దీంతో సరే అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది లాస్య.
Intinti Gruhalakshmi Nov 25 Episode
ఇంట్లోంచి వెళ్లిపోవడానికి రెడీ అయిన లాస్య..
గదిలో లక్కీ.. తులసితో మాట్లాడుతుండగా కోపంగా వచ్చి లాక్కెళ్తుంది లాస్య. తన గదిలోకి బ్యాగులో బట్టలు సర్దుతుండగా, లక్కీ సారీ మమ్మీ తప్పు చేశాను. ఇంకెప్పుడు ఆంటీతో మాట్లాడను, నువ్వు చెప్పినట్టే వింటానని లక్కీ.. లాస్యను బతిమిలాడుతుంటాడు. దీంతో లాస్య సారీ చెప్పాల్సింది నువ్వు కాదు నేను.. నేనే ఆవేశంగా నిర్ణయాలు తీసుకుని నా జీవితాన్నే కాకుండా నీ జీవితాన్ని కూడా నాశనం చేశానంటూ ఎక్కడికైనా వెళ్లి బతుకుదాం అంటూ లక్కీని తీసుకుని బయలు దేరుతుంది. తులసి లాస్యను ఆపి ఎక్కడికి వెళ్తున్నావని అడుగగా.. ఏమీ తెలియనట్టు మాట్లాడకు, ఈ డ్రామాలు వద్దు ఇక.. నందు నన్ను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు అంటూ ఏడుస్తూ మాట్లాడుతుంది లాస్య..
లాస్యకు ప్రామిస్ చేసిన తులిసి..
లక్కీని చూసి బాధపడిన తులసి… నందుతో నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది.. నేను జరిపిస్తానని మాట ఇస్తుంది. దీంతో లాస్య తన ఆవేశాన్ని తగ్గించుకుని ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇదే విషయం గురించి మాట్లాడేందుకు నందు వద్దకు వెళ్లగా.. అప్పటికే కోపంగా ఉంటాడు నందు.. పెద్ద వాళ్ల గొడవలకు పిల్లలను బలిచేయొద్దని తులసి మనసులో అనుకుంటూ నందుతో వారిస్తుంది. తులసి కోపంగా లాస్యను పెళ్లి చేసుకోవాలని ఖరాఖండిగా చెప్పేసి వెళ్లిపోతుంది. తర్వాతి ఏం జరిగిందో తెలియాలంటే ‘ఇంటింటి గృహలక్ష్మి’కొనసాగుతోంది.