Intinti Gruhalakshmi Nov 30 Today Episode : తులసికి సంబంధించి నందుకు షాకింగ్ విషయం చెప్పిన కృష్ణ.. ఇంతకీ ఏంటది?

Intinti Gruhalakshmi Nov 30 Today Episode :స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్‌లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రోజుకో ట్విస్టుతో కథలో ఇంట్రెస్టింగ్ పెరుగుతోంది. మరి ఈ రోజు ( నవంబర్ 30, 2021)న ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. ఆస్పత్రిలో ఉన్న తులసి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలంటూ ఏడుకొండలవాడికి మొక్కుకుంటుంది అనసూయ. అలా జరిగితే నీ గుడికి నడుచుకుంటూ వస్తానంటూ వేడుకుంటుంది. ఇక తులసి ఆరోగ్య పరిస్థితిని […].

By: jyothi

Published Date - Tue - 30 November 21

Intinti Gruhalakshmi Nov 30 Today Episode : తులసికి సంబంధించి నందుకు షాకింగ్ విషయం చెప్పిన కృష్ణ.. ఇంతకీ ఏంటది?

Intinti Gruhalakshmi Nov 30 Today Episode :స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్‌లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రోజుకో ట్విస్టుతో కథలో ఇంట్రెస్టింగ్ పెరుగుతోంది. మరి ఈ రోజు ( నవంబర్ 30, 2021)న ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..


ఆస్పత్రిలో ఉన్న తులసి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలంటూ ఏడుకొండలవాడికి మొక్కుకుంటుంది అనసూయ. అలా జరిగితే నీ గుడికి నడుచుకుంటూ వస్తానంటూ వేడుకుంటుంది. ఇక తులసి ఆరోగ్య పరిస్థితిని చెక్ చేస్తాడు కృష్ణ. ఇక సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉంటాడు. దీంతో నందు కోపానికి గురవుతాడు. తులసి హెల్త్ గురించి చెప్పకుండా నీరు పోస్తున్నావేంటి అని డాక్టర్ ను ప్రశ్నిస్తాడు. తులసి బ్రెయిన్ గురించి వాటర్ ఉదహరణగా చూసుతూ చెబుతాడు డాక్టర్.. తులసికి నీ వల్ల కలుగుతున్న ప్రెజర్, టెన్షన్‌లు, గొడవలు, అవమానాలు, బాధ్యతలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తనకు శక్తికి మించి వాటిని ఆమె భరిస్తుంది. మనం ప్రతి చిన్న విషయానికి ఆడవాళ్లపైన అరుస్తూ ఉంటాం. వారు మాత్రం వాటిని భరిస్తూ ఉంటారే కానీ.. ఏనాడు ఎదురు తిరగరు. ఇంతకు ముందు మీరు చూపించిన ప్రేమ ముందు నుంచీ చూపించి ఉంటే బాగుంటుండే అని చెబుతాడు కృష్ణ. తులసిపై ఎక్కువగా ప్రెజర్స్ పెట్టి ఆవిడను బాధపెట్టారు. ఇక మీదట ఆమె ఎలా ఉంటాలో మీరే నిర్ణయించుకోండి అంటూ చెబుతాడు కృష్ణ.


Intinti Gruhalakshmi Nov 30 Today Episode

Intinti Gruhalakshmi Nov 30 Today Episode



తర్వాత కృష్ణ, నందు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. నందు కాస్త పశ్చత్తాపడుతూ ఏదో అలా జరిగింది. నాకేం అర్థం కావడం లేదు అంటాడు నందు. ఇందుకు కృష్ణ మాట్లాడుతూ మీరు చేస్తున్న తప్పే తులసి ప్రాణాలకు ముప్పుగా మారుతోంది అంటాడు కృష్ణ. ఇక తులసిని హ్యపీగా ఉంచాల్సిన బాధ్యత మీదేనంటూ చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత తులసికి మెలకువ వస్తుంది. నందు వచ్చి కాసేపు పడుకో అంటూ చెబుతాడు. లాస్యకు ఫోన్ చేశారా? అని నందును అడుగుతుంది తులసి. లాస్యను పెళ్లి చేసుకోమని నందుకు చెబుతుంది. ఇందుకు నందు బదిలిస్తూ పెళ్లి పోస్ట్ పోన్ చేస్తున్నామనగానే.. తులసి ఫీల్ అవుతుంది. లాస్యకు ఫోన్ చేస్తానంటూ తులసి లేస్తుండగా మళ్లీ ఆమె కళ్లు తిరుగుతాయి. దీంతో ఆమెను నందు పట్టుకుంటాడు. అప్పుడే వచ్చిన లాస్య.. తులసి, నందు దగ్గరగా ఉండటాన్ని చూసుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Tags

Latest News

Related News