• Telugu News
  • movies

Intinti Gruhalakshmi nov 8th episode : ఆ నిజాన్ని తనలోనే దాచుకుంటానంటున్న శృతి.. లాస్యకు బిగ్ షాక్..

Intinti Gruhalakshmi nov 8th episode : మా టీవీలో వస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ రోజు నవంబర్ 8న ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు ఓసారి చూద్దాం. సోమవారం రోజు 471వ ఎపిసోడ్ టెలీకాస్ట్ అయింది. ఈ ఎపిసోడ్ లో శృతి అంకితకు వార్నింగ్ ఇచ్చే సీన్ హైలెట్ గా నిలిచింది. అంకితను బెదిరిస్తూ శృతి కోపానికి రావడం ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. అసలు శృతి అంకితకు […].

By: jyothi

Published Date - Mon - 8 November 21

Intinti Gruhalakshmi nov 8th episode : ఆ నిజాన్ని తనలోనే దాచుకుంటానంటున్న శృతి.. లాస్యకు బిగ్ షాక్..

Intinti Gruhalakshmi nov 8th episode : మా టీవీలో వస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ రోజు నవంబర్ 8న ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు ఓసారి చూద్దాం. సోమవారం రోజు 471వ ఎపిసోడ్ టెలీకాస్ట్ అయింది. ఈ ఎపిసోడ్ లో శృతి అంకితకు వార్నింగ్ ఇచ్చే సీన్ హైలెట్ గా నిలిచింది. అంకితను బెదిరిస్తూ శృతి కోపానికి రావడం ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. అసలు శృతి అంకితకు ఎందుకు వార్నింగ్ ఇస్తుందని చాలా మంది సీరియల్ ను ఫాలో కాని వారు డౌటు పడతారు.

డబ్బుల విషయంలో శృతి అంకితకు వార్నింగ్ ఇస్తుంది. నేను నీలా మారిపోయి ప్రవర్తిస్తే ఇంట్లో అందరూ నిన్ను ఛీ కొడతారు. ఊరుకుంటూంటే తెగ రెచ్చిపోతున్నావేంటి అని అడుగుతుంది. నువ్వు ఆరోజు ఆంటికి ఇచ్చిన డబ్బుల విషయం మర్చిపోయావా. నేను ఆ డబ్బుల గురించి కానీ ఆంటికి చెబితే నీ బతుకేమవుతుందో ఒక్కసారి ఊహించుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది. చివరికి శృతి అంకితకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

ప్రాజెక్టు డెడ్ లైన్ లోపు పూర్తి చేయండి….

ఇక శృతి అంకితకు వార్నింగ్ ఇచ్చే సీన్ అయిపోయిన తర్వాత తులసి, నందు, లాస్య ఆఫీసుకి వెళ్తారు. అక్కడి ఉద్యోగులకు ఒక నెల ముందే జీతాలు క్లియర్ చేసి పనిని ప్రారంభించమని చెబుతారు. ప్రాజెక్టును డెడ్ లైన్ లోపు పూర్తి చేయాలని టార్గెట్ విధిస్తాడు నందు. ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఎర్రర్ ఎంత ప్రయత్నించినా కానీ పోవడం లేదని ఓ ఉద్యోగి లాస్యను పిలుస్తాడు. కానీ లాస్య ప్రయత్నించినా కానీ ఆ ఎర్రర్ మాత్రం పోదు.

Intinti Gruhalakshmi nov 8th episode-2

Intinti Gruhalakshmi nov 8th episode-2

ఎర్రర్ తీసేసేందుకు ఎంటరైన నందు..

ఎర్రర్ తీసేసేందుకు లాస్య ఎంతలా ప్రయత్నించినా కానీ అది పోదు. దీంతో అక్కడికి నందు వస్తాడు. వచ్చి రావడంతోనే నందు ఆ ఎర్రర్ ను సాల్వ్ చేస్తాడు. ఇది చూసిన తులసి చాలా సంతోషిస్తుంది. తన రూమ్ లోకి వెళ్లిన నందుకు తులసి కాఫీ ఇవ్వడం చూసి షాక్ కు గురవుతుంది. తులసి నందూ కాసేపు మాట్లాడుకుంటారు. వర్క్ గురించి లాస్య ఓ ఉద్యోగి మీద సీరియస్ అవుతుంది. ఇంకా కోడింగ్ పని పూర్తి కాలేదా అని దబాయిస్తుంది. దీంతో ఆ ఉద్యోగి ఇంకా కాలేదు మేడం అంటూ బదులిస్తాడు. ఇంతలో అక్కడికి తులసి వచ్చి లాస్యతో ఎందుకు అతడిని టెన్షన్ కు గురి చేస్తున్నావు.

అని లాస్యను అంటుంది. అసలు ఏం జరిగిందో చూసి సాల్వ్ చేయాలని లాస్యకు చెబుతుంది. దీంతో కోపానికి వచ్చిన లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి. అంటూ తులసి ఆ ఉద్యోగితో అంటుంది. చాలా రోజులయింది కదా పనిచేయక కాస్త టైమ్ పడుతుంది. అని సర్ది చెబుతుంది. ఈ విషయంలో లాస్య తులసికి మధ్య గొడవవుతుంది. సాయంత్రం అందరూ ఇంటికి చేరుకున్నాక బెంగుళూరు నుంచి క్లయింట్ నందు తులసికి మాత్రమే రావాలంటూ విమాన టికెట్లు పంపిస్తాడు. దీంతో లాస్య మరింత కోపానికి వస్తుంది.

Tags

Latest News

Related News