• Telugu News
  • movies

Intinti Gruhalakshmi Nov 9th Episode : పక్కపక్కనే కూర్చొని మళ్లీ నందు, తులసిల ప్రయాణం.. రగిలిపోతున్న లాస్య..

Intinti Gruhalakshmi Nov 9th Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘ఇంటింటి గృహలక్ష్మి’ ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్‌గా మారింది. ఈ సీరియల్‌లో రోజురోజుకూ కొత్త కొత్త ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. ఇకపోతే తులసి-నందులు అఫీషియల్‌గా విడిపోయినప్పటికీ మళ్లీ వీరిద్దరు మధ్య ప్రేమాయణం జరిగే వీలున్నట్లుగా తాజా ఎపిసోడ్ల ద్వారా అర్థమవుతున్నది. మంగళవారం నాటి 472వ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి నందులు ప్రాజెక్టు విషయమై వర్క్ చేయడం స్టార్ట్ అయినప్పటి […].

By: jyothi

Published Date - Tue - 9 November 21

Intinti Gruhalakshmi Nov 9th Episode : పక్కపక్కనే కూర్చొని మళ్లీ నందు, తులసిల ప్రయాణం.. రగిలిపోతున్న లాస్య..

Intinti Gruhalakshmi Nov 9th Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘ఇంటింటి గృహలక్ష్మి’ ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్‌గా మారింది. ఈ సీరియల్‌లో రోజురోజుకూ కొత్త కొత్త ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. ఇకపోతే తులసి-నందులు అఫీషియల్‌గా విడిపోయినప్పటికీ మళ్లీ వీరిద్దరు మధ్య ప్రేమాయణం జరిగే వీలున్నట్లుగా తాజా ఎపిసోడ్ల ద్వారా అర్థమవుతున్నది. మంగళవారం నాటి 472వ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తులసి నందులు ప్రాజెక్టు విషయమై వర్క్ చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్యకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒకపోతే ఆఫీసు ప్రాజెక్టు విషయమై బెంగళూరు వెళ్లేందుకుగాను తులసి , నందులకు పక్కపక్కనే ఫ్లైట్స్ బుక్ అయితాయి. ఈ విషయం తెలుసుకుని లాస్య ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. మరో వైపున తులసి, నందులను మళ్లీ కలిసేలా పనిమనిషి రాములమ్మ పురమాయించే ప్రయత్నం చేస్తుంది.

తులసిలో నందుపై తగ్గిపోయిన ప్రేమను మళ్లీ మేల్కొలిపేలా చేస్తుంది. అయితే, తులసి మాత్రం తన బంధం నందుతో విడిపోయిందనే వేదాంతం వర్ణిస్తూ చెప్తుంది. తనకు మళ్లీ కలిసే ఉద్దేశం లేదన్నట్లుగా మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే తాళి బంధం బలమైనదని, అంత త్వరగా తెగిపోదని రాములమ్మ తులసికి చెప్తుంది.

 

Intinti Gruhalakshmi Nov 9th Episode

Intinti Gruhalakshmi Nov 9th Episode

సీన్ కట్ చేస్తే.. మరో వైపు లాస్య తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని రగిలిపోతుంటుంది. ఇంతలో భాగ్య వచ్చి లాస్యలోపల మరింత ఆగ్రహాన్ని పెంచేస్తుంటుంది. బావగారు నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక తులసికి విడాకులు ఇచ్చారని, తులసిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నిన్ను మ్యారేజ్ చేసుకోవడం లేదని, అలా బావగారు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారని భాగ్య అంటుంది. దాంతో లాస్య ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలే ఒళ్లు మండిపోతుంటే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది లాస్య. అయినప్పటికీ భాగ్య కామ్ కాదు. గుచ్చి గుచ్చి మాట్లాడుతూ లాస్య మనసులో మంటలు చెలరేపుతుంది భాగ్య.

మరోవైపున బెంగళూరుకు వెళ్లేందుకుగాను నందు, తులసిలు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంతలోనే నందు వచ్చి మీటింగ్ ఇంకో రెండు రోజులు పొడిగించే చాన్స్ ఉందని, ఇంకో రెండు జతల బట్టలు సర్దాలని చెప్తాడు. దాంతో తులసి సిగ్గుపడుతుంది. ఇక నందు, తులసి బెంగళూరుకు బయలుదేరి వెళ్తున్న క్రమంలో లాస్య నందుకు పలు జాగ్రత్తలు చెప్తుంది. ఈ క్రమంలోనే ఫ్లైట్‌లో పడుకోవద్దని లాస్య చెప్తుంది. అలా పలు కండీషన్స్ పెడ్తుంది లాస్య. మొత్తానికి నందు, తులసిలు బెంగళూరుకు చేరుకోగా, వారిరువురు ఒకే రూంలో ఉంటారనే లాస్య అనుమానాన్ని భాగ్య రెట్టింపు చేస్తుంది. దాంతో టెన్షన్ తట్టుకోలేనని, తాను నెక్స్ట్ ఫ్లైట్‌కు బెంగళూరుకు వెళ్తానని లాస్య అంటుంది. ఇంతలోనే ఎపిసోడ్ ముగుస్తుంది.

Tags

Related News