Intinti Gruhalakshmi November 13 Episode: తప్పు తెలుసుకున్న నందు… నీ ప్రేమ కావాలంటూ మళ్లీ తులసి వద్దకు..

Intinti Gruhalakshmi November 13 Episode: ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ తెలుగు లోగిళ్లలో హిట్ సీరియల్ గా నిలిచింది. ఈ సీరియల్ చూస్తుంటే మిడిల్ క్లా స్ జీవితాలు ఎలా ఉంటాయో చక్కగా అర్థమవుతోందని పలువురు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఓ సాధారణ ఇల్లాలు ఎలా ఉంటుందనేది తులసిని చూస్తే మనకు అర్థమైపోతుందంటున్నారు. తన భర్త అయిన నందు ఎన్ని తప్పులు చేస్తూ పోతున్నా కానీ తులసి మాత్రం నందు బాగుండాలని కోరుకోవడం ఇల్లాలిగా మంచి లక్షణం అని […].

By: jyothi

Published Date - Sat - 13 November 21

Intinti Gruhalakshmi November 13 Episode: తప్పు తెలుసుకున్న నందు… నీ ప్రేమ కావాలంటూ మళ్లీ తులసి వద్దకు..

Intinti Gruhalakshmi November 13 Episode: ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ తెలుగు లోగిళ్లలో హిట్ సీరియల్ గా నిలిచింది. ఈ సీరియల్ చూస్తుంటే మిడిల్ క్లా

స్ జీవితాలు ఎలా ఉంటాయో చక్కగా అర్థమవుతోందని పలువురు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఓ సాధారణ ఇల్లాలు ఎలా ఉంటుందనేది తులసిని చూస్తే మనకు అర్థమైపోతుందంటున్నారు.

తన భర్త అయిన నందు ఎన్ని తప్పులు చేస్తూ పోతున్నా కానీ తులసి మాత్రం నందు బాగుండాలని కోరుకోవడం ఇల్లాలిగా మంచి లక్షణం అని మెచ్చుకుంటున్నారు. తనకు ఎదురైన కష్టాలను చూసి చలించకుండా తులసి పోరాటం చేసే విధానం చాలా బాగుందని చెబుతున్నారు. ఇలా అనేకమైన ట్విస్టులతో సాగుతున్న ఈ సీరియల్ నవంబర్ 13న ఏంజరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

లాస్య మందు గోళీలను అనసూయకి తెచ్చి ఇస్తుంది. దీంతో ఫుల్ కోపానికి వచ్చిన అనసూయ తన కోసం లాస్యను అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని అంటుంది. దీంతో లాస్య తాను తెచ్చిన టాబ్లెట్స్ ను టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది. అప్పుడు అనసూయకు తులసి గతంలో చేసిన సేవలు గుర్తుకు వస్తాయి. అప్పుడు అనసూయ బాధపడుతుంది. తులసికి అన్యాయం చేశానే అని పరంధామయ్యని పట్టుకుని విలపిస్తుంది. దీంతో పరంధామయ్య అనసూయను ఓదార్చుతాడు. నీ తప్పును తెలుసుకున్నావు కదా నీవు మారిపోయావు అంటూ ఓదారుస్తాడు.

Intinti Gruhalakshmi November 13 Episode -2

Intinti Gruhalakshmi November 13 Episode -2

ఇక అప్పుడే నందు బాగా డ్రింక్ చేసి తన రూమ్ కు తిరిగి వస్తాడు. దీంతో తులసి నందును డ్రింక్ చేసి వచ్చారా అని నిలదీస్తుంది. తులసిని ఎందుకు నన్ను నిలదీస్తున్నావు. పొద్దున్నే మనం మాజీ భార్యాభర్తలని చెప్పావు కదా మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావని అంటాడు. దీంతో అనసూయ నందుకు సారీ అని చెబుతుంది. నందు మాత్రం ఆగకుండా అనసూయను ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. తనకు తెలియకుండానే తన జీవితంలోకి లాస్య ఎంటర్ అయిందని అంతా అయిపోయిందని చెబుతాడు. అప్పుడు తులసి నందుతో అయిపోయిన కథను మళ్లీ ఎందుకు చెబుతున్నారని అడుగుంది. అయిపోయిన స్టోరీని చెప్పడం వలన మీకు మందు వేస్ట్ నాకు టైమ్ వేస్ట్ అని తులసి అంటుంది. నందు అప్పుడు తులసితో లాస్య మాయలేడీ అంటూ చెబుతాడు. తనను లాస్య భారి నుంచి విముక్తి చేయమని తులసిని వేడుకుంటాడు. అంతే కాకుండా తులసిని హత్తుకుని ఐ లవ్ యూ తులసి అని చెప్పినట్లు మనకు చూపిస్తాడు.

కానీ లాస్య ఇదంతా కలగంటుందని తర్వాత రివీల్ చేస్తారు. తులసికి నందు ఐ లవ్ యూ చెప్పి హగ్ చేసుకున్నాడని తనకు కల రాగానే లాస్య ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది. నో అంటూ అరుస్తుంది. వెంటనే భయంతో నందుకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్ అని గబగబా అడుతుంది. దీనికి నందు కోపంగా ఇంకా ఎక్కడ ఉంటాను. ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాను. అని చీదరింపుగా అంటాడు. అయినా కానీ లాస్యకు నమ్మకం కుదరక వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత నందుతో నీ రూమ్ చాలా రొమాంటిక్ గా ఉంది నందు. చూస్తుంటేనే మూడ్ వస్తుంది. నీకు నన్ను చూడాలని అనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తుంది.? ప్రతి రోజు నీలో ఉండే రొమాంటిక్ యాంగిల్ ఏమైందని అడుగుతుంది. ఆ మహాతల్లి తులసి నీతో పాతికేళ్లు ఎలా కాపురం చేసిందో అంటూ మాట్లాడుతుంది లాస్య.

Tags

Latest News

Related News