Intinti Gruhalakshmi OCT 25 Episode : ఇళ్లంతా పొగబెట్టిన శృతి.. నందు, లాస్యకు చురకలు అంటించిన తులసి..!

Intinti Gruhalakshmi OCT 25 Episode : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ -25వ ఎపిసోడ్ వచ్చిన సన్నివేశాలు అందరినీ తెగ అలరించాయి. శృతి ప్రేమ్ ఆడే దొంగ నాటకాలు, నందు, లాస్య మధ్య జరిగే సంభాషణలు.. చివరగా తులసి తనదైన స్టైల్లో నందకు క్లాస్ పీకడం అందరినీ అలరించాయి. అసలు ఎపిసోడ్ మొత్తంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. రాములమ్మకు వచ్చిన కొత్త అనుమానం.. శ్రుతి-ప్రేమ్‌‌ల శోభనం రోజున […].

By: jyothi

Published Date - Mon - 25 October 21

Intinti Gruhalakshmi OCT 25 Episode : ఇళ్లంతా పొగబెట్టిన శృతి.. నందు, లాస్యకు చురకలు అంటించిన తులసి..!

Intinti Gruhalakshmi OCT 25 Episode : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ -25వ ఎపిసోడ్ వచ్చిన సన్నివేశాలు అందరినీ తెగ అలరించాయి. శృతి ప్రేమ్ ఆడే దొంగ నాటకాలు, నందు, లాస్య మధ్య జరిగే సంభాషణలు.. చివరగా తులసి తనదైన స్టైల్లో నందకు క్లాస్ పీకడం అందరినీ అలరించాయి. అసలు ఎపిసోడ్ మొత్తంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రాములమ్మకు వచ్చిన కొత్త అనుమానం..

శ్రుతి-ప్రేమ్‌‌ల శోభనం రోజున దుప్పటి నలుగక పోవడంపై రాములమ్మకు కొత్త అనుమానం కలుగుతుంది. ఇదే విషయంపై రాములమ్మ ప్రశ్నించగా తులసికి కూడా అనుమానం వస్తుంది. వీళ్లిద్దరి మధ్య అంతా బాగానే ఉందా అనుకుంటుండగా.. ప్రేమ్ వచ్చి ‘రాములమ్మా ఏంటి నీ అనుమానాలు.. రాత్రి మంచం పై పాలు ఒలికాయి. అందుకే దుప్పటి మర్చాం.. చూడు అని పాత దుప్పటి చూపిస్తాడు. దీంతో రాములమ్మ, తులసి కామ్ అయిపోతారు.అనంతరం తులసి.. శ్రుతిని త్వరగా రెడీ అయి రావాలని, అమ్మవారికి పూజ చేయాలని చెబుతుంది.

లాస్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి.. తన గురించి ఏమైనా అనుకుటుందేమో అని నందు లోలోపల మదనపడుతుండగా.. తులసి దగ్గరకు వచ్చి అదంతా మీ పర్సనల్.. విడాకులు ఇచ్చేసాను. నాకు అవసరం లేదంటుంది. ఆ తర్వాత కంపెనీ ప్రాజెక్ట్ అడుగుతూ ఎంప్లాయీస్‌కు కాల్ చేయమన్న కదా చేశారా అని అంటుంది.దీంతో నందు కోపంగా.. సాఫ్ట్ వేర్ జాబ్ అంటే నాలుగు కుట్టు మిషన్లు నడిపించి డబ్బులు సంపాదించడం కాదు. ఎంతో అనుభవం అవసరం.. నాకు, లాస్యకు సాధ్యం కానిది.. నీ వల్ల ఏమవుతుందని సీరియస్ అవుతాడు. అప్పుడు తులసి నా టాలెంట్ అందరికీ తెలుసు.. ఒక్క మీకు తప్పా అని సెటైర్ వేస్తుంది.

Intinti Gruhalakshmi OCT 25 Episode

Intinti Gruhalakshmi OCT 25 Episode

లాస్య, నందుకు తులసి చురకలు..

అంతలోనే లాస్య వచ్చి.. అన్నీ తులసి చూసుకుంటే మీరెం చేస్తారని ప్రశ్నిస్తుంది. మరోవైపు ప్రేమ్ తన రొమాన్స్‌ ప్రారంభిస్తాడు. కావాలనేశ్రుతి వచ్చి తనపై పడేలా చేసి.. వారి మధ్య శోభనం జరగకపోయినా అందరినీ జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

ఇకపోతే శ్రుతి పూజ ప్రారంభించి ఇళ్లంతా ధూపం వేస్తుంది. దీంతో అంకిత నిద్రలో నుంచి లేచి ఇంట్లో ఏమైనా కట్టెల పొయ్యి పెట్టారా? అని ఈ పొగంతా ఏమిటని గట్టిగా అరవడంతో .. పరందామయ్య కలుగుజేసుకుని ఎపుడైనా దేవుడికి పూజ చేస్తే ధూపానికి, కట్టెల పొగకు తేడా తెలుస్తుందని వెటకారం చేస్తాడు.

శ్రుతి అమ్మవారికి పూజ చేస్తుండగా.. తులసి తెగ పొంగిపోతుంది. ఇంతలో లాస్య మధ్యలో వచ్చి పూజలు చేస్తే బాధ్యతలు తీరవని.. కష్టపడాలని మీ అత్తకు చెప్పాలని శ్రుతికి చెబుతుంది. దీంతో దేవుడి శక్తికి మించినది ఏదీ లేదంటూ నందు లాస్యలకు మరోసారి చురకలు అంటిస్తుంది తులసి.. దీంతో నందు అలాగే నిలబడిపోగా.. ఎపిసోడ్ పూర్తవుతుంది.

Tags

Latest News

Related News