Intinti Gruhalakshmi OCt 28 Episode : కొత్తగా పెళ్లయిన జంట శృతి, ప్రేమ్ తమ మధ్య లేని ప్రేమ ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్టోబర్ 28వ తేదిన టెలికాస్ట్ అయిన ఇంటింటి గృహలక్ష్మీ ఎపిసోడ్‌ను వీక్షించిన ప్రేక్షకులు మాత్రం మాకేంటీ కర్మ అనుకుంటున్నారట.. అస్సలు ఆసక్తిగా లేదని సోదిలో ఎపిసోడ్ అంటున్నారు.
శృతికి చిరాకు తెప్పించిన అంకిత..
ప్రేమ్ తన భార్యకు యోగాసనాలు వేయడం నేర్పిస్తుంటే చూసిన అంకిత కళ్లలో నిప్పులు పోసుకుంటుంది. తన భర్తను లేపి తీసుకొచ్చి మీ తమ్ముడు తన భార్యకు ఆసనాలు నేర్పిస్తున్నాడు. నువ్వు ఉన్నావ్.. ఎందుకు తినడం పడుకోవడం తప్పా.. అని చివాట్లు పెడుతుంది అంకిత.. నా ప్రేమ లేదు నీకు తగ్గిపోయిందని అంకిత అనగానే.. ఫ్రెష్‌గా తెచ్చిన కాఫీనే చల్లారిబోతుంది. రెండేళ్ల మన ప్రేమ ఎంత..శృతి ప్రేమ్ ల ప్రేమ కూడా అంతే అని చెప్పి లోనికి వెళ్లిపోతాడు అభి.
రాములమ్మ ఇంతలో జ్యూస్ తీసుకుని వెళ్తుండగా అంకిత ఆపి ఎవరికీ అని అడుగగా.. ప్రేమ్, శృతిల కోసం తులసి అమ్మగారు చేశారు అని చెప్పగా.. అంకిత కోపంతో రగిలిపోతుంది. సేవలన్నీ చిన్న కోడలికే.. పాత కోడలు పాత రాగిచెంబులా మారిపోయింది ఈ ఇంట్లో అని విసుక్కుంటుంది. దీంతో శ్రుతి చేసే పూజలు చేసి మార్కులు కొట్టేయాలని అంకిత భావిస్తుంది. విషయం తెలిసిన శృతి కావాలంటే మనిద్దరం చేద్దాం.. నేను మొక్కుకున్నాను అని అంకితకు చెప్పడంతో ఆమె కుదరదు అని చెబుతుంది.
intinti gruhalaxmi oct 28th episode-2
కట్ చేస్తే.. జీకే సాయం కోసం నందు ఎదురుచూస్తుంటాడు.కంపెనీ అప్పులు తీర్చే బాధ్యత తులసి తీసుకున్నప్పడు మీకు ఎందుకు బాధ.. అని లాస్య నందును ప్రశ్నిస్తే ఆమె వల్ల కాదు తీర్చడం.. ఉద్యోగులు కూడా రాలేమని చెబుతున్నారని అంటాడు నంద .. ఈ విషయం నేను చూసుకుంటానని లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలోనే తులసి ఓ కొత్త ప్రాజెక్ట్‌ను సెలెక్ట్ చేయడం.. ఆ విషయాన్ని నందుకు చెప్పి.. 3 నెలల్లో కంప్లీట్ చేస్తానని మాటిచ్చాను.. మీరు త్వరగా వస్తే ఆఫీసుకు వెళ్లి పని చూద్దాం అని చెబుతుంది.
ఇంతో శృతి తులసి, నందు, లాస్య కోసం లంచ్ బాక్స్ పెడుతుంది. దీంతో శృతిని తులసి మెచ్చుకోగా.. నందు చీవాట్లు పెడుతాడు. ఆ తర్వాత శృతి వంటింట్లో కూరగాయాలు కట్ చేస్తుండగా.. అంకిత వెళ్లి వాటిని కింద పడేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే.. ఈ ఇంట్లో నా విలువను నువ్వు తగ్గిస్తున్నావని.. అది నాకు ఇష్టం లేదని అంకిత గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు శృతి నువ్వు ఏది చెబితే అది చేస్తా.. ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయకు అని అనడంతో .. ఈ రోజు నుంచి నా పనులు అన్ని నువ్వే చేయాలని చెబుతుంది అంకిత. తర్వాతి భాగం వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం ఎం జరుగుతుందో..