Intinti Gruhalakshmi October 23 Today episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ విడుదలైంది. కాగా శనివారం ఎపిసోడ్ హైలైట్స్ మామాలుగా లేవు. ఇంతకు మందున్న ఎపిసోడ్స్‌కు భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా ఈ ఎపిసోడ్ ఉంది.
Intinti Gruhalakshmi October 23 Today episode : అప్పు తీర్చడానికి ఆ పని వాయిదా వేసుకున్న ప్రేమ్-శ్రుతి..
నందు లాస్య మాటలు విని అప్పుల పాలయ్యాడన్న సంగతి తెలిసిందే.. కాగా, ఆ అప్పులను తీర్చే భాధ్యతను తులసి తీసుకుంటుంది. ఈ సంగతులు ఇలా కొనసాగుతుండగానే మరో వైపు ప్రేమ్ -శ్రుతి ఫస్ట్ నైట్ ఏర్పాట్లలో తులసితో పాటు కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉంటారు. ఈ క్రమంలోనే ఇంటిలోనే ఓ గదిలో డోర్ లాక్ చేసుకోకూండనే లాస్య, నందు ముచ్చటిస్తూ ఉంటారు. అంతలోని ఆ గదిలోనికి తులసి వస్తుంది.
గది లోపల లాస్య, నందు రొమాన్స్ చేస్తుండటం చూసి తులసి షాక్ అవుతుంది. వయసుకు ప్రేమకు సంబంధం లేదు అన్న రీతిలో లాస్య, నందు రొమాన్స్ చూసి షాక్ అవుతుంది తులసి. ఆ సీన్ చూసి తులసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అయితే, లాస్య అలా తాము రొమాన్స్ చేస్తుండగా తులసి చూడటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. భార్యా భర్తలు గదిలో ఉన్నపుడు అడిగి రావాలని తెలియదా అని తులసిని అంటుంది లాస్య. కాగా లాస్య తనపై చివాట్లు పెట్టడం తులసికి నచ్చలేదు.
ఏకాంతంలో ఉన్నపుడు తలుపులు వేసుకోవాలన్న సంగతి మీకు తెలియదా అని తులసి లాస్యను తిరిగి ప్రశ్నిస్తుంది. ఇంతకీ భార్యా భర్తలు ఎవరు అని అంటుంది. దాంతో లాస్య నందు వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది.
Intinti Gruhalakshmi October 23 Today episode
శోభనం గదిలో నూతన జంట అయిన ప్రేమ్, శ్రుతి ఉంటారు. ఇద్దరి మధ్య చిలిపి ప్రశ్నల పర్వం షురూ అవుతుంది. పాల గ్లాస్ చెరి సగం ఎందుకు తాగాలి? అని ప్రేమ్ శ్రుతిని అడుగుతాడు. కష్ట సుఖాలు చెరి సగం పంచుకోవాలనే ఉద్దేశంతో అలా చేస్తారని చెప్తుంది. ఇకపోతే శోభనం తొలి రోజునే భర్త భార్యకు గిఫ్ట్ ఇవ్వాలని శ్రుతి అంటుంది. దాంతో ప్రేమ్ ఓకే..ఏం కావాలో అడుగు అని అంటాడు. అప్పడు తొలి రాత్రి జరగొద్దని చెప్పి శ్రుతి షాక్ ఇస్తుంది.
మన పెళ్లి కోసం తులసి ఆంటీ చాలా కష్టపడిందని, రూ.రెండు కోట్ల అప్పు భారాన్ని ఆమె తనపైన వేసుకుందని, అది తీరేంత వరకు మన శోభనం జరగొద్దని కండీషన్ పెడ్తుంది. అందుకు ప్రేమ్ సైతం ఓకే చెప్తాడు. అయితే, తులసి అప్పు తీర్చడం కోసం ఇలా శోభనం వాయిదా వేసుకోవడం చూసి షాక్ అయ్యారు ప్రేక్షకులు. ఇలాంటి ట్విస్ట్ ఏంటి? లాజిక్ లేదనే చర్చ జరుగుతున్నది. అప్పు తీరడానికి శోభనం వాయిదా వేయడం నిజంగానే ఊహించని ట్విస్ట్ అని పలువురు అంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియాంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.