Isha Koppikar on Casting Coutch : సినీ రంగంలో ఎప్పటి నుంచో రకరకాల కాస్టింగ్ కౌచ్ వార్తలు వింటూనే ఉన్నాం. ఒక్కోసారి ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మీటూ ఉద్యమ సమయం నుంచే ఇలాంటి కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ అనే తేడాలు లేకుండా అందరూ ఇలాంటి వాటిని బయట పెడుతున్నారు.
ఇప్పుడు మరో హీరోయిన్ ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ ఇషా కొప్పికర్. ఆమె గతంలో ఓ హీరో గురించి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో గురించి ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. నేను సినిమాల్లో ఛాన్సులు రావాలంటే మంచి అందం, అభినయం ఉంటే సరిపోతుందని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ అది నిజం కాదని నాకు తెలిసింది. మనకు ఛాన్స్ రావాలంటే హీరో అవసరాలు తీర్చాలి. ఓ హీరో 2018లో నాకు ఫోన్ చేసి తన రూమ్ కు రమ్మన్నాడు.
నేను అప్పటికే ఆయన సినిమాలో నటిస్తున్నాను. అతనికి అప్పటికే పెళ్లి అయింది. మరో మహిళతో అక్రమ సంబంధం కూడా ఉంది. అతని కన్ను నా మీద పడింది. నన్ను అనుభవించాలని ఉందంటూ నీచంగా మాట్లాడాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఆ కోపంతోనే నన్ను సినిమాలో నుంచి తీసేశారు అంటూ చెప్పింది ఇషా.