Jaswanth Padala : బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీకి వచ్చిన ‘వర్టిగో’ డిసీజ్ వివరాలివే..

Jaswanth Padala : హెల్త్ ఇష్యూస్ వల్ల బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ జెస్సీ అలయాస్ జస్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఆ అరుదైన వ్యాధి ఏంటి.. దాని వివరాలేంటో తెలుసుకుందాం. జెస్సీకి వచ్చిన ఆ రేర్ డిసీజ్ నేమ్ ‘వర్టిగో’. కాగా, దాని వల్ల జెస్సీ టాస్కులు చేయలేకపోతున్నాడు. ఫుడ్ తినలేకపోవడంతో పాటు సరిగా నడవలేకపోతున్నాడు. వ్యాధి తీవ్రతను బట్టి అతడిని ఇంటికి పంపించే చాన్సెస్ […].

By: jyothi

Published Date - Sun - 14 November 21

Jaswanth Padala : బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీకి వచ్చిన ‘వర్టిగో’ డిసీజ్ వివరాలివే..

Jaswanth Padala : హెల్త్ ఇష్యూస్ వల్ల బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ జెస్సీ అలయాస్ జస్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఆ అరుదైన వ్యాధి ఏంటి.. దాని వివరాలేంటో తెలుసుకుందాం.

జెస్సీకి వచ్చిన ఆ రేర్ డిసీజ్ నేమ్ ‘వర్టిగో’. కాగా, దాని వల్ల జెస్సీ టాస్కులు చేయలేకపోతున్నాడు. ఫుడ్ తినలేకపోవడంతో పాటు సరిగా నడవలేకపోతున్నాడు. వ్యాధి తీవ్రతను బట్టి అతడిని ఇంటికి పంపించే చాన్సెస్ ఉన్నాయి. ఈ సంగతులు అలా ఉంచితే..‘వర్టిగో’ డిసీజ్ ఎలా వస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

వర్టిగో అనగా తలదిరిగే డిసీజ్ అని అర్థం. మెడికల్ లాంగ్వేజ్‌లో ‘వర్టిగో’ అంటుంటారు. దీనిని ‘గిడ్డీనెస్, డిజ్జీనెస్’ అని కూడా పిలుస్తారు. మేల్స్ కంటే కూడా ఫిమేల్స్‌లో ఈ వ్యాధి లక్షణాలు తొందరగా కనిపెట్టేయొచ్చు. ఈ డిసీజ్ లక్షణాలు చిత్రంగా ఉండటం గమనార్హం. అయితే, ఇందులో తలతిరడం అనేది కామన్ లక్షణంగా గుర్తించొచ్చు. ఈ డిసీజ్ వచ్చిన వ్యక్తికి నడుస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చే వ్యక్తి సరిగా కనబడడు. దానికి తోడు ఎదురుగా అన్ని గుంతలు అన్నట్లు అనిపిస్తుంటుంది. దాంతో పాటు తాను లోయలో పడిపోతున్నానా? అనే ఫీలింగ్ కూడా కలుగుతుంటుందట. ఐస్ (కళ్లు) విజిబులిటీ కూడా తగ్గుతుందట. దృష్టి లోపం ఉండటంతో పాటు కళ్లు వాటంతట అవే కదులుతున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి గాల్లో తేలుతున్నట్లు భావిస్తుంటాడు.

Jaswanth Padala3మ

Jaswanth Padala3మ

తమ చుట్టు ఉన్న వస్తువులు, ఇతర సామగ్రి అంతా కూడా స్థిరంగా ఉందని అస్సలు భావిస్తుంటాడు. అన్నీ కూడా ఎటో ఎటో తిరుగుతున్నాయని అనుకుంటుంటాడు. ఇకపోతే ఒక వేళ రెస్ట్ తీసుకునేందుకుగాను మంచంలో నిద్రించినట్లయితే మంచం కూడా గిర్రును తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. పైన కూర్చొని కిందకు చూసినట్లయితే కింద ఓ పెద్ద లోయ కనబడుతుంటుంది.

ఏదేని వస్తువును తదేకంగా చూసినట్లయితే చీకటిగా అనిపించడంతో పాటు మొత్తం శూన్యంలోనే ఉన్నామని భావిస్తారు. అలా చిన్న చిన్న నక్షత్రాలు మెరుస్తున్నట్లు మాత్రమే సదరు డిసీజ్ పేషెంట్‌కు కనబడుతుంది. ఈ డిసీజ్ ఉన్న పర్సన్ ఎటు పడుకుంటే అటు వైపు బరువుగా అనిపిస్తుంటుంది. నిద్ర, ఆకలి అస్సలు ఉండదు. నీరసంగా అనిపించడంతో పాటు మూతి వంకరపోతుంటుంది. వారికి ఎటు చూసినా వింత వింత ఆకారాలు కనబడుతుంటాయి. కాళ్లూ, చేతులు చచ్చుబడిపోతాయి. నడస్తుంటే కూడా బ్యాలెన్స్ చేసుకోలేపోతుంటారు. పడిపోతామేమో అన్న భావన వారిలో ఉంటుంది.

 

Tags

Latest News

Related News