Jeevitha Rajasekhar : జీవిత రాజశేఖర్ గురించి అందరికి పరిచయం ఉంది. ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత రాజశేఖర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కానీ మా అసోసియేషన్ ఎన్నికల్లో కీలక పదవులను చేపట్టింది. తెలుగు సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా ఉంది.
కాగా గతంలో మీటూ ఉద్యమంలో కొందరు టాలీవుడ్ మీద చేసిన ఆరోపణలను ఆమె తిప్పి కొట్టింది. కానీ తాజాగా ఆమెనే కాస్టింగ్ కౌచ్ మీద ఆరోపణలు చేసింది. తాను కూడా వేధింపులు ఎదుర్కున్నట్టు తెలిపింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను గతంలో ఓ సినిమాలో నటించేందుకు ఓ నిర్మాత వద్దకు వెళ్లి ఆఫర్ అడిగాను.
దాన్ని అతను అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. సరే ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తరచూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. నా క్యారవాన్ లోకి వచ్చి డైరెక్టుగా నాతో అసభ్యంగా మాట్లాడేవాడు. రూమ్ కు రమ్మని ఇన్ డైరెక్టుగా అడిగేవాడు. దాంతో నాకు చిరాకేసింది.
అతనికి వార్నింగ్ ఇచ్చి.. ఆ సినిమా నుంచి తప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది జీవిత రాజశేఖర్. ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రతిఘటించాలని ఆమె చెబుతోంది. కానీ ఇప్పటి హీరోయిన్లు లొంగిపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also : Shruti Haasan : నువ్వు వర్జినా..? నెటిజన్ ప్రశ్న.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చిన శృతి..!
Read Also : Tollywood Heroines : మద్యం తాగే అలవాటు ఉన్న టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?