Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఆయన క్రేజ్ ఖండాంతరాలను దాటిపోతోంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇప్పుడు ఐదు భాషల్లో రిలీజ్ అవుతోంది. నటనలో ఈ తరంలో ఆయన్ను కొట్టేవాడే లేడు. ఆ రేంజ్ లో ఆయన సినిమాలను లేపుతుంటాడు తన నటనతో.
ఎంత నందమూరి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా సరే ఈ స్థాయికి వచ్చాడంటే అదంతా ఆయన రెక్కల కష్టం అనే చెప్పుకోవాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ముగ్గురు హీరోయిన్లతో లవ్ ఎఫైర్ నడిపాడంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో చూసుకుంటే.. మొదటగా హీరోయిన్ గజాలా ఉంటుంది.
వీరిద్దరి కాంబోలో స్టూడెంట్ నెంబర్ 1 మూవీ వచ్చింది. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరూ దానిపై పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆమెతో సినిమాలు చేయలేదు. ఇక ఆంధ్రావాలా సినిమా చేస్తున్నప్పుడు హీరోయిన్ రక్షితతో కూడా జూనియర్ డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.
అప్పట్లో వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ స్పందించలేదు. ఇక అశోక్ సినిమా చేస్తున్నప్పుడు కూడా హీరోయిన్ సమీరారెడ్డితో ప్రేమలో ఉన్నాడని చాలామంది చెప్పుకున్నారు. ఇరువురి ఇండ్లలో ఈ విషయం తెలుసని టాక్ నడిచింది. కానీ చివరకు అది కూడా ఫేక్ అని తేలింది.
Read Also : Shruti Haasan : స్నానం చేసేటప్పుడే ఆ పని చేస్తా.. శృతిహాసన్ చెండాలమైన ఆన్సర్..!
Read Also : Madhavi Latha : పడక గదికి రమ్మన్నాడు.. దర్శకుడిపై మాధవీలత ఫైర్..!