Jr NTR : నందమూరి ఫ్యామిలీ ఇమేజ్ ను పెంచుతున్నాడు తారక్. తాత, బాలయ్య తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్. ఎంత నందమూరి ఇమేజ్ తో వచ్చినా సరే తన సొంత కష్టంతోనే ఆయన ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పుకోవాలి. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం ఆయన చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. కాగా జూనియర్ ఎన్టీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఆస్తులు గురించిన వార్తలు తాజాగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆస్తులు మొత్తం కలిపి దాదాపు రూ.440 కోట్లకు పైగానే ఉందని అంచనా. ప్రస్తుతం ఆయన ఒక్కో మూవీకి రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
కాగా ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ నుంచి కొన్ని ఆస్తులు వచ్చాయంట. సీనియర్ ఎన్టీఆర్ సంపాదించిన దాంట్లో హరికృష్ణకు వారసత్వంగా నిమ్మకూరులో కొంత భూమి వచ్చింది. అందులో నుంచి 5 ఎకరాలు జూనియర్ ఎన్టీఆర్ కి వస్తుందట. 2005లో నిమ్మకూరులో ఒక ఎకరానికి రూ.5 లక్షలు మాత్రమే ఉండేది.
కానీ ఇప్పుడు ఆ ధర ఎకరానికి రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అంటే మొత్తం కలిపి రూ.15 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని బయట పెట్టింది వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.
Read Also : Sai Dharam Tej : ఆమెతో లవ్ లో పడ్డా.. సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లకు బయట పెట్టాడుగా..!
Read Also : Actress Prema : ఉపేంద్రతో హీరోయిన్ ప్రేమ లవ్ ఎఫైర్.. ఇన్నాళ్లకు బయట పడిందిగా..!