K Raghavendra Rao : తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు రఘవేంద్ర రావు సినిమాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కమర్షియల్ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన డైరెక్టర్లలో కే.రాఘవేంద్రరావు ఒకరు. ఆయన తన సినిమాలను అద్భుతంగా తెరకెక్కించేవారు. దర్శుకులు అందరిలో రాఘవేంద్రరావుకు ప్రత్యేక శైలి ఉంటుందని చెప్పవచ్చు. ఈయన చాలా మంది అగ్రహీరోలకు భారీ హిట్స్ అందించారు.
తన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకునే వారు. అప్పట్లో రాఘవేంద్ర రావుతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు కూడా ‘క్యూ’ కట్టేవారని తెలిసింది. ఈయన చాలా మంది హీరో, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. అయితే, ఓ హీరోకు మాత్రం ఒక్క ప్లాప్ ఇవ్వలేదని తెలిసింది. ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ..
తొమ్మిది చిత్రాలు.. అన్నీ సూపర్ హిట్లే..
సూపర్ స్టార్ కృష్ణతో దర్శకుడు రాఘవేంద్రరావు చాలా సినిమాలు తీశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏకంగా తొమ్మిది చిత్రాలు వచ్చాయి. దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఎనిమిది మూవీల్లో కృష్ణ హీరోగా నటించగా, ఒక సినిమాలో మాత్రం అతిథి పాత్రలో కనిపించారు. రాఘవేంద్రరావు, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్‌లో ‘అడవి సింహాలు’ అనే సినిమా తీశారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కింది. మొదటి చిత్రం ‘భలే కృష్ణుడు’ కాగా, బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌గా నిలిచింది.
K Raghavendra Rao
రెండో చిత్రం ‘ఘరానా దొంగ’ కాగా, శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. మూడో చిత్రం ‘ఊరుకి మొనగాడు’, నాలుగో చిత్రం ‘అడవి సింహాలు’. ఇందులో కృష్ణంరాజు హీరో కాగా, మరో హీరోగా కృష్ణ నటించారు. ఐదో చిత్రం ‘శక్తి’. ఈ మూవీలో కృష్ణ తండ్రి కొడుకులుగా డ్యుయల్ రోల్ చేశారు. ఆరో చిత్రం ‘ఇద్దరు దొంగలు’ కాగా, ఇందులో శోభన్ బాబు, మరో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఏడో చిత్రం ‘అగ్ని పర్వతం’లో కృష్ణ అన్నదమ్ములుగా ద్విపాత్రిభినయం చేశారు.
ఎనిమిదో చిత్రం ‘వజ్రాయుధం’.. ఇందులోనూ కృష్ణ సరసన శ్రీదేవి నటించింది. తొమ్మిదో మూవీ ‘రాజ కుమారుడు’లో కృష్ణ అతిథి పాత్రలో కనిపించగా హీరోగా మహేష్ బాబుకు డెబ్యూట్ చిత్రమైన విషయం తెలిసిందే. అయితే. ఈ తొమ్మిది సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌గా నిలిచాయి.