Kaikala Satyanarayana.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో నటులు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు ‘కైకాల సత్యనారాయణ’ కూడా ఒకరు. ఈయన తన కెరీర్‌లో ఎక్కువగా ప్రతి నాయకుడి పాత్రల్లోనే నటించారు. వయసులో ఉన్న టైంలో అగ్రహీరోలు అందరితో కలిసి కైకాల పనిచేశారు. కాకపోతే ఆయన కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా విలన్ రోల్స్ మాత్రమే దొరికాయట.. అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా విలన్ రోల్స్ పోషించిన వారు సైతం తమదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దిగ్గజ నటుల్లో కైకాల పేరు తప్పకుండా ఉంటుంది.
కైకాల ప్రస్థానం..
కైకాల సత్యనారాయణ (86) ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లాలో 25 July 1935 లో జన్మించారు. ఆయన విద్యా్భ్యాసం తర్వాత సినిమాల్లోకి వచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ఆయనకు ఎక్కువగా విలన్ రోల్స్ మాత్రమే వచ్చేవట.. ఏదైతే ఏంటీ.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నది ఆయన ఆశయం. అందుకే ప్రతినాయకుడి పాత్రలను కూడా ఎంతో చాలెంజింగ్ కూడా తీసుకున్నారట..1960లలో NTR, ANR, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు అలనాటి దిగ్గజ నటులతోనూ కలిసి నటించారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నేటి తరం హీరోలతో కలిసి నటించారు.
Kaikala_Satyanarayana
కైకాల తన సినీ కెరీర్లో 750 వరకు సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ప్రభుత్వం తరఫున తన ఉత్తమ నటనకు గాను ‘నంది’, ‘జాతీయ’ అవార్డులను సైతం అందుకున్నారు. ఇకపోతే కైకాల కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా రాణించారు. సత్యనారయణ లీడ్ రోల్స్ చేసిన ‘ఘటోత్కచుడు’, ‘యమలీల’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘యుముడు’ పాత్రలో ఒదిగిపోయే కైకాల తనకు ప్రత్యామ్నాయం మరొకరు లేరని ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత టీడీపీ పార్టీలో చేరి 11వ లోక్‌సభకు ఎంపిక అయ్యారు.
రేపుల సత్యనారాయణ అని ఎందుకు పేరొచ్చిందటే..
కైకాల సత్యనారాయణ ఆయన తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అందులో హీరోయిన్లు, మహిళలను వేధించే పాత్రలకు న్యాయం చేసేవారు. ఇలా ఒక్కటని కాదు వందల సినిమాల్లో విలన్ గా చేయడం, మహిళలను వేధించడం, అత్యాచారాలు చేయడం, హింసించడం వంటి క్యారెక్టర్స్ చేసిన కైకాలను మహిళా ప్రేక్షకులు నిజంగానే విలన్ గా ఊహించుకున్నారట.
ఒకానొక సందర్భంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరవ్వగా మహిళలు ఈ రేపుల ‘సత్తి గాన్ని’ చంపేయాలని దాడికి కూడా దిగారట.. కొందరు రేపుల సత్యనారాయణ అని పిలిచేవారట… తర్వాత అసలు విషయం తెలిసి చాలా నవ్వుకున్నారని తెలిసింది. అందుకే ఆయనకు రేపుల సత్యనారాయణ అని పేరొచ్చింది.