Kajal Aggarwal : సినిమా హీరోయిన్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు అంటే వారి అభిమానులకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఈ జనరేషన్ లో అయితే పలానా హీరోయిన్ పలానా హీరోతో రిలేషన్ లో ఉంది అంటూ చాలానే వార్తలు వస్తున్నాయి. ఎవరైనా హీరోయిన్ కాస్తంత రాసుకుని పూసుకుని తిరిగితే చాలు సదరు హీరోతో ఆమెకు ఎఫైర్ ను అంటగట్టేస్తారు.
అయితే టాలీవుడ్ చందమామ కాజల్ పై కూడా అప్పట్లో ఇలాంటి వార్తలు బాగా వచ్చాయి. కానీ ఒకే ఒక్క హీరోతో ఆమెకు ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆమె మన తెలుగులో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అటు తమిళంలో కూడా అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
అయితే ఆమె అప్పట్లో బన్నీతో ఆర్య-2 సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. కాగా ఈ సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ పెండ్లి చేసుకుంటారంటూ అప్పట్లో న్యూస్ వైరల్ అయింది. కాగా ఓ ఇంటర్వ్యూలో రిపోర్టర్ నేరుగా ఈ ప్రశ్న వేశాడు.
kajal aggarwal reacts On love affair with allu arjun
దానిపై కాజల్ సీరియస్ అయింది. అసలు తాను ఏ హీరోతో కూడా రిలేషన్ లో లేను అంటూ కుండ బద్దలు కొట్టేసింది. దాంతో ఆమె మీద ఇలాంటి వార్తలు ఆగిపోయాయి. ఆ తర్వాత కూడా ఆమె మీద ఇలాంటివి రాలేదు.
Read Also : Nandamuri Balakishna : బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారా.. అప్పట్లో బయట పడ్డ నిజం ఇదే..!
Read Also : Star Hero And Heroines : మత్తేక్కించే అందాల మధ్య తారల టాటూలు, వాటి అర్ధాలు తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటారు