ఆదిత్య 369 ను కాదన్న కమల్.. బాలు చెప్పగా బాలయ్య ద్విపాత్రాభినయం
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఆవిష్కరించిన అద్బుతాల్లో ఆదిత్య 369 ఒకటి అనడంలో సందేహం లేదు. హాలీవుడ్ సినిమాల తరహాలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాను తీయాలంటే.. దాంతో ప్రేక్షకులను మెప్పించాలంటే చాలా ఘట్స్ కావాలి. ప్రేక్షకులను ఎలా తన సబ్జెక్ట్ లతో ఆకట్టుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి సింగీతం. అందుకే ఆయనకు ఆదిత్య 369 సినిమా ను సూపర్ హిట్ చేసుకోవడం చాలా సులభం అయ్యింది. సినిమాను సక్సెస్ చేయడం సులభం అయినా కూడా […].
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఆవిష్కరించిన అద్బుతాల్లో ఆదిత్య 369 ఒకటి అనడంలో సందేహం లేదు. హాలీవుడ్ సినిమాల తరహాలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాను తీయాలంటే.. దాంతో ప్రేక్షకులను మెప్పించాలంటే చాలా ఘట్స్ కావాలి. ప్రేక్షకులను ఎలా తన సబ్జెక్ట్ లతో ఆకట్టుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి సింగీతం. అందుకే ఆయనకు ఆదిత్య 369 సినిమా ను సూపర్ హిట్ చేసుకోవడం చాలా సులభం అయ్యింది.
సినిమాను సక్సెస్ చేయడం సులభం అయినా కూడా సినిమాను మొదలు పెట్టడానికి మాత్రం దర్శకులు సింగీతం చాలా ఇబ్బంది పడ్డారట. ఈ సినిమా కథ అనుకున్న సమయంలో ఇద్దరు హీరోలతో ఈ సినిమాను తీయాలని భావించారట. సినిమాలోని శ్రీకృష్ణ దేవరాయ పాత్రకు మొదటి నుండి బాలకృష్ణ ను మనసులో అనుకున్న సింగీతం వారు మరో పాత్ర అయిన కృష్ణ కుమార్ పాత్రకు పలువురు హీరోలను అనుకుని కొందరితో చర్చించారట. చాలా మంది టైమ్ ట్రావెలర్ కథ ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు అంటూ పెదవి విరిచి సున్నితంగా తిరష్కరించారట. చివరకు సింగీతం వారు యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ వద్దకు వెళ్లారట. అంతకు ముందే ఇద్దరికి ఉన్న పరిచయం.. ఇద్దరి కాంబోలో వచ్యిన సినిమాలు సక్సెస్ అవ్వడం వల్ల కమల్ చేస్తాడని భావించారు. కాని అప్పటికే కమల్ హాసన్ కు ఉన్న కమిట్ మెంట్స్ కారణంగా ఏడాది పాటు సినిమాకు ఒప్పుకునే అవకాశం లేదు.
బాలకృష్ణ డేట్లు అప్పటికే తీసుకుని ఉన్న కారణంగా ఏడాది పాటు వెయిట్ చేయడం సాధ్యం కాని విషయంగా సింగీతం వారు భావించి చివరకు కృష్ణ కుమార్ పాత్రను కూడా బాలకృష్ణతోనే చేయిస్తే పాయే.. బాలకృష్ణ ను అభిమానులు ద్విపాత్రాభినయంలో చూసి మరింతగా సినిమాను ఎంజాయ్ చేస్తారని కొందరు అనడంలో సింగీతం వారు ధైర్యం చేశారు. మరో ఆలోచన లేకుండా బాలకృష్ణను రెండు పాత్రలు చేయమని చెప్పి కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశాడు.
బాలకృష్ణ తో అలా ఆదిత్య 369 సినిమా మొదలయ్యింది. ఇళయరాజా సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా 1991 ఆగస్టు 18న విడుదల అయ్యింది. సినిమా ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకు వెళ్లినట్లుగా అనిపించింది. నిజంగా టైమ్ మిషన్ ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ సినిమాను రెండు మూడు సార్లు చూసి సూపర్ హిట్ చేశారు. సింగీతం మొదట అనుకున్నట్లుగా కృష్ణ కుమార్ పాత్రను మరో హీరోతో చేయించి ఉంటే ఈ రేంజ్ సక్సెస్ దక్కక పోయేది. కొన్ని సార్లు మన చేతుల్లో ఏమీ లేకుండానే అద్బుతాలు జరుగుతాయి. అలాంటిదే ఈ సినిమా కు మరే హీరో కమిట్ అవ్వక పోవడం. బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించి ఆదిత్య 369 సూపర్ హిట్ చేశాడు. కమల్ అప్పుడు బిజీగా ఉండి చేయక పోవడమే మంచిదయ్యిందని ఆ తర్వాత చాలా సందర్బాల్లో సినిమా యూనిట్ సభ్యులు అనుకున్న సందర్బాలు ఉన్నాయట.
Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu