Kangana Ranaut : కంగనా రనౌత్ అంటే బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్. ఆమె ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా స్టార్ హీరోలను ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటుంది ఈ భామ. హీరోయిన్ల రెమ్యునరేషన్, వారికి ఎదురయ్యే సమస్యలపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉంటుంది ఈ బోల్డ్ హీరోయిన్.
ఇక కెరీర్ పరంగా ఎంతో ఎత్తులో నిలబడ్డ కంగనా రనౌత్.. వ్యక్తిగతంగా మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఆమెపై ఎప్పటికప్పుడు ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆమె మాత్రం వెనక్కు తగ్గట్లేదు. కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ భామ పర్సనల్ విషయాలను పంచుకుంది.
నేను కూడా అమ్మాయినే. నాలో కూడా కొన్ని కోరికలు ఉంటాయి. గతంలో నిజమైన ప్రేమ కోసం చాలా వెతికాను. ఆ క్రమంలో చాలామంది అబ్బాయిలతో డేటింగ్ కు వెళ్లాను. కానీ ఎక్కడా నాకు నిజమైన ప్రేమ కనిపించలేదు. కేవలం నా అందాలను ప్రేమించే వారు మాత్రమే కనిపించారు తప్ప నా మనసును అర్థం చేసుకోలేదు.
అందుకే వారితో బ్రేకప్ చేసుకున్నాను. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి అదే పెద్ద కారణం. నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికిన రోజున కచ్చితంగా పెండ్లి చేసుకుంటాను అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది కంగనా. అయితే ఆమె ఎవరితో డేటింగ్ చేసిందో మాత్రం చెప్పలేదు. గతంలో ఆమె చాలామంది స్టార్ హీరోలతో క్లోజ్ గా తిరిగింది.
Read Also : Nikhil Siddhartha : భార్యతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.. మొత్తానికి ఒప్పుకున్నాడు..!
Read Also : Eesha Rebba : నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నా.. ఈషారెబ్బా సంచలన ఆరోపణలు..!