Karthik Deepam December 2 Episode: దీప స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ.. నమస్కారం నేను డా. కార్తీక్ భార్యని… తాళి కట్టిన భార్యని అని చెబుతుంది. ఎందుకు అలా చెబుతున్నానంటే కొంత మంది తమకు తామే తాళి కట్టుకుని భార్యలమని చెప్పుకు తిరుగుతున్నారు అంటూ మోనితను ఉద్దేశించి అంటుంది. ఈ స్టేజి మీద కేవలం డాక్టర్లు మాత్రమే మాట్లాడాలి కానీ కొందరి ఆరోపణలకు సమాధానం చెప్పేందుకే తాను స్టేజి ఎక్కానని చెబుతుంది. ఇప్పటి దాకా మోనిత చెప్పినవన్ని అబద్దాలే అని కుండ బద్దలు కొడుతోంది.
మోనిత చాలా బాగా అందమైన అబద్దాలు ఆడిందని పేర్కొంటుంది. మోనితతో కార్తీక్ బాబు కేవలం స్నేహం మాత్రమే చేశారని చెబుతుంది. స్నేహంగానే రెండు మూడు సార్లు ఇంటికి వెళ్లారని పేర్కొంటుంది. మా వారికి నాకు చాలా సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయి.. మేము ఇద్దరం సుఖంగా, సంతోషంగా కలిసి ఉన్నాం.
ఇబ్బందులు కూడా వచ్చాయని అవి ఇతరులు క్రియేట్ చేసినవని చెబుతుంది. దానికి మోనిత కోపంగా దీప అని అరుస్తుంది. దీప వెంటనే మోనితను ఆగు పాప నీవు నీకు అనుకూలంగా ఉండే విషయాలను మాత్రమే చెప్పావు. కానీ వీళ్లకు అసలు నిజాలు తెలియాలి కదా అని అంటుంది. నీవు చేసిన కిడ్నాప్ లు, యాక్సిడెంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ నాకు సంస్కారం ఉంది అవి మీతో చెప్పను అని దీప అక్కడున్న డాక్టర్లతో అంటుంది.
Karthik Deepam December 2 Episode
మీరు పెద్దలు మీరే కాస్త ఆలోచించండి అని దీప వాళ్లని రిక్వెస్ట్ చేస్తుంది. నేరం రుజువయి జైలుకెళ్లొచ్చిన మోనిత ఏది పడితే అది మాట్లాడింది. డాక్టర్ బాబు ఈ పదవికి అనర్హుడని అంది. అసలు మోనిత స్వరూపం తెలిసిన తర్వాత మోనిత మాటలను ఎందుకు నమ్మాలి? అని ప్రశ్నిస్తుంది. డాక్టర్ బాబు ఈ పదవికి అనర్హుడని మోనిత చెప్పింది. కాదు మోనిత లాంటి వారు డాక్టర్ వృత్తికే కళంకం అని చెప్పి దీప స్టేజి దిగి వెళ్లిపోతుంది. ఇక తనకు జరిగిన అవమానానికి కోపంతో మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బాబును ఎత్తుకుని ప్రియమణి కూడా మోనిత వెనకాలే వెళ్తుంది.
ఇక డాక్టర్ భారతి స్టేజెక్కి మైక్ తీసుకుని ఇప్పుడు డాక్టర్ కార్తీక్ స్టేజి మీదకు రావాలని కోరుతుంది. కానీ కార్తీక్ స్టేజి మీదకు వెళ్లకుండా లేచి అందరికీ దండం పెడతాడు. కార్తీక్ బయటకు వెళ్లబోతుంటే అందరూ ఆపే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన మోనితతో ప్రియమణి కార్తీక్ ను వదిలేయొచ్చు కదమ్మా.. మీకు ఇన్ని అవమానాలు అవసరమా? అని ప్రశ్నిస్తుంది. దానికి ప్రియమణిని మోనిత కొట్టబోతుంది. కానీ కొట్టకుండా ఆగుతుంది. అప్పుడు ప్రియమణితో కార్తీక్ ను వదిలే సమస్యే లేదు. అని చెబుతుంది.