Karthika Deepam 16 Nov Today Episode : ఫలించిన మోనిత పథకం.. కార్తీక్‌ను నిల‌దీసిన ఆదిత్య‌..

Karthika Deepam 16 Nov Today Episode : తెలుగు నాట బుల్లితెర మీద విశేషంగా ఆదరించబడుతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు ఎలాంటి వీరాభిమానులు ఉన్నారో.. ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లను ఒక్క సారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అటువంటి కార్తీక దీపం సీరియల్ నేడు 1198వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టనుంది. మరి ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దామా… సీరియల్ హీరోయిన్ వంటలక్క అలియాస్ దీప ఇన్ డైరెక్టుగా […].

By: jyothi

Published Date - Tue - 16 November 21

Karthika Deepam 16 Nov Today Episode : ఫలించిన మోనిత పథకం.. కార్తీక్‌ను నిల‌దీసిన ఆదిత్య‌..

Karthika Deepam 16 Nov Today Episode : తెలుగు నాట బుల్లితెర మీద విశేషంగా ఆదరించబడుతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు ఎలాంటి వీరాభిమానులు ఉన్నారో.. ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లను ఒక్క సారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అటువంటి కార్తీక దీపం సీరియల్ నేడు 1198వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టనుంది. మరి ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దామా…

సీరియల్ హీరోయిన్ వంటలక్క అలియాస్ దీప ఇన్ డైరెక్టుగా డైలాగులు పేలుస్తూ ఉంటుంది. కూర బాగానే చేశాను, చారు బాగానే చేశాను అంటూ ఆనందరావుకు, డాక్టర్ బాబుకు చురకలు అంటిస్తూ ఉంటుంది. తింటున్న ఆదిత్య దీపను ఓ విషయం అడుగుతాడు. ఏంటి వదినా ఈ రోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావ్. నవ్వుకుంటూ ఉన్నావ్ అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు దీప ఆన్సర్ తో కార్తీక్, సౌందర్య, ఆనందరావుల ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంతకీ దీప ఏం చెబుతుందంటే.. నవ్వుతూనే ఉండాలని ఫిక్స్ అయ్యాను ఆదిత్య.

లేకపోతే ఏడిపించే వాళ్లు ఎక్కువవుతున్నారు. అంటూ సెటైర్ వేస్తుంది. ఇక ఆ డైలాగ్ ముగిసిన తర్వాత దీప తను చేసిన వంటలకు మార్కులు ఇవ్వమని వంటలు తిన్న ఆనందరావు, సౌందర్య, కార్తీక్ లను అడుగుతుంది. ఉలవచారుకు ఎన్ని మార్కులు మావయ్య.. కొత్తి మీర పచ్చడికి ఎన్ని మార్కులు అత్తయ్య.. గుత్తి వంకాయ కూరకు ఎన్ని మార్కులు డాక్టర్ బాబు అని ప్రశ్నిస్తుంది.

Karthika Deepam

Karthika Deepam

పదికి పది అని డాక్టర్ బాబు కాస్త ఇబ్బందిగా దీపను చూస్తూ అంటాడు. డాక్టర్ బాబు ఇది చెప్పే కంటే ముందే దీప నన్ను ఫెయిల్ చేయకండి అని వేడుకుంటుంది. వంటల్లో నన్ను అందరూ పాస్ చేశారు కదా జీవితంలో ఫెయిల్ చేయొద్దని డైలాగ్ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇక మోనిత విషయానికి వస్తే ముఖ్యమైన గెస్ట్ రాబోతున్నాడంటూ చాలా హడావుడి చేస్తుంది. ఇలా చేస్తుండగా.. ఆ ఇంటికి ఆదిత్య వస్తాడు. ఇది చూసిన ప్రియమణి షాక్ కు గురవుతుంది. ఆదిత్య వచ్చి అన్నయ్య, అన్నయ్య అని అరుస్తూ కార్తీక్ ని వెతుకుతుంటాడు. అప్పడు మోనిత తాపీగా మీ అన్నయ్య ఇక్కడికి రాలేదు ఆదిత్య. నువ్వు రావాలనే అలా చెప్పాను అని అంటుంది. తనకు బాబు పుట్టాడని మీ అన్నయ్య తన భర్తగా సంతకం చేశాడని చెబుతుంది. అంతే కాక శాంతి పూజలు కూడా చేయించారని వివరిస్తుంది. ఈ విషయాలు అన్నీ విన్న ఆదిత్య కార్తీక్ ని నిలదీస్తాడు. వదినకు ఎందుకు ద్రోహం చేస్తున్నావని చెడా మడా కడిగిపారేస్తాడు.

Tags

Latest News

Related News