• Telugu News
  • movies

Karthika Deepam 3 Dec Today Episode : కార్తీక్‌ను విడిచి‌పెట్టనన్న మోనిత.. రాంగ్ ఆపరేషన్ చేసి వ్యక్తిని చంపేసిన డాక్టర్ బాబు..

Karthika Deepam 3 Dec Today Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో డెఫినెట్‌గా అందరి ఫేవరెట్ సీరియల్ ‘కార్తీక దీపం’ అని చెప్పొచ్చు. ఈ సీరియల్ పాత్రధారులు మోనిత, కార్తీక్, దీప, సౌందర్య ఇతరుల గురించి ప్రతీ ఇంట్లో చర్చించుకుంటుంటారు గృహిణులు. శుక్రవారం నాటి 1,213 ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక్ పరిస్థితి చూసి తనకు చాలా బాధేస్తోందని సౌందర్య బాధపడుతుంటుంది. అంతలోనే దీప వచ్చి బాధపడొద్దని సౌందర్యకు చెప్తుంది. ఎన్ని టెన్షన్స్ […].

By: jyothi

Updated On - Fri - 3 December 21

Karthika Deepam 3 Dec Today Episode : కార్తీక్‌ను విడిచి‌పెట్టనన్న మోనిత.. రాంగ్ ఆపరేషన్ చేసి వ్యక్తిని చంపేసిన డాక్టర్ బాబు..

Karthika Deepam 3 Dec Today Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో డెఫినెట్‌గా అందరి ఫేవరెట్ సీరియల్ ‘కార్తీక దీపం’ అని చెప్పొచ్చు. ఈ సీరియల్ పాత్రధారులు మోనిత, కార్తీక్, దీప, సౌందర్య ఇతరుల గురించి ప్రతీ ఇంట్లో చర్చించుకుంటుంటారు గృహిణులు. శుక్రవారం నాటి 1,213 ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.


కార్తీక్ పరిస్థితి చూసి తనకు చాలా బాధేస్తోందని సౌందర్య బాధపడుతుంటుంది. అంతలోనే దీప వచ్చి బాధపడొద్దని సౌందర్యకు చెప్తుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ దీప తన పని తాను చేస్తుందని సౌందర్య దీపను ప్రశంసిస్తుంది. ఇకపోతే ఈ క్రమంలోనే సౌందర్య తనను క్షమించాలని దీపను వేడుకుంటుంది. తాను క్షమించడమేంటని అత్తయ్యను ఉద్దేశించి దీప అంటుంది.


సీన్ కట్ చేస్తే.. ఇల్లు చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రతీ దానికి తను సమాధానం చెప్తానని మోనిత శపథం చేస్తుంది. డాక్టర్ బాబు కార్తీక్‌ను విడిచి పెట్టేది లేదని, దీపనే తన సర్వస్వమని అనుకుంటున్న దీప సంగతి కూడా చెప్తానని మోనిత అంటుంది. కార్తీక్ తనంతట తాను వచ్చి తన చుట్టు తిరుగుతూ అనగా ప్రదక్షిణలు చేసేలా చేస్తానని మోనిత అంటుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రియమణికి మోనిత చెప్తుంటుంది.

Karthika Deepam 3 Dec Today Episode

Karthika Deepam 3 Dec Today Episode

మరోవైపున కార్తీక్ ఆస్పత్రికి వెళ్తాడు. అక్కడ అనారోగ్యంతో తన భర్త ఉన్నాడని, ఆయన్ను కాపాడాలని ఓ మహిళ డాక్టర్ బాబు కార్తీక్‌ను వేడుకుంటుంది. దాంతో ఏం కాదు.. తాను ఆపరేషన్ చేసి సదరు పేషెంట్‌ను బతికిస్తానని డాక్టర్ బాబు కార్తీక్ ఆ మహిళకు ధైర్యం చెప్పి ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తాడు. సదరు పేషెంట్ తప్పక బతుకుతాడని పేర్కొంటాడు కార్తీక్.


ఈ క్రమంలోనే ఈవినింగ్ అవుతున్నప్పటికీ కార్తీక్ ఇంకా ఇంటికి రావడం లేదని సౌందర్య టెన్షన్ పడుతుంది. మళ్లీ మోనిత ఏదైనా ఇబ్బంది పెట్టిందా అని ఆలోచన చేస్తుంటుంది. మరో వైపున కార్తీక్ ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ చేసేందుకు సిద్ధమవుతుండగా అతడికి కళ్లు తిరుగుతుంటాయి. అస్వస్థతగా ఫీలవుతున్నప్పటికీ బ్లేడ్ తీసుకుని సర్జరీ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. రవి ఏమైందని కార్తీక్‌ను అడుగుతాడు.


మత్తుగా ఉన్నప్పటికీ కార్తీక్ ఆపరేషన్ చేయడానికే మొగ్గు చూపి ఆపరేషన్ చేస్తుంటాడు. రవి వద్దని వారిస్తున్నప్పటికీ కార్తీక్ ఆపరేషన్ చేస్తుంటాడు. ఆపరేషన్ తప్పుగా చేస్తున్నారని రవి అంటూనే ఉండగా, అంతలోనే పేషెంట్‌ను మీరే చంపేశాడు డాక్టర్ బాబు అని రవి అంటాడు. దాంతో కార్తీక్ షాక్‌లోకి వెళ్తాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags

Latest News

Related News