karthika deepam 4 nov Today Episode.. సీరియల్స్‌లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న ఆదరణే వేరు. ముఖ్యంగా స్టార్ మా వ్యూయర్స్ ఈ సీరియల్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా రక్తికట్టించే సన్నివేశాలతో కార్తీక దీపం వ్యూయర్స్‌ను కట్టిపడేస్తోంది. మరోవైపు, ట్విస్టులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్న ఈ సీరియల్ 1188 ఎపిసోడ్(నవంబర్ 4)లో ఏం జరిగిందో చూద్దామా మరి..
శాంతి పూజకు అవసరమయ్యే వస్తువులను కార్తీక్, సౌందర్య కొని కారు దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ మమ్మీ ఏంటి నువ్వు శాంతి పూజలు అంటావ్.. సామాగ్రి అంతా కొంటావ్.. నేను మాత్రం రాను మమ్మీ.. వస్తే ఆ మోనిత పక్కన కూర్చుని పూజ చేస్తే నేను అన్నీ ఒప్పుకున్నట్టే కదా.. రాను మమ్మీ అని చెప్పగా.. సౌందర్య కార్తీక్‌కు నచ్చచెబుతుంది. అది కాదురా.. దీప కోసమే నేను ఇది చేస్తున్నాను. గండం అంటే నీకే కదా.. నీకు ఏమైనా అయితే దీప, పిల్లలకు అన్యాయం జరుగుతుంది అని సౌందర్య కార్తీక్‌కు చెబుతున్నది. వారిద్దరూ కారుకు కాస్త దూరంలో ఉండగా.. ఓ కరెంట్ వైపు తెగి కారుపై పడిపోతోంది. ఈ విషయాన్ని వారిద్దరూ గమనించకుండా కారు దగ్గరికి వెళ్తారు. ఈ పరిస్థితిని ఓ కనస్ట్రక్షన్ పని చేసే వ్యక్తి చూసి కంగారు పడి పరుగుత్తుకుంటూ వెళ్తాడు.
కార్తీక్ కారును ముట్టుకోబోతుండగా అతను వచ్చి లాగేస్తాడు. ఏంటి సార్ సచ్చిపోదామని అనుకుంటున్నారా? కారు మీద కరెంట్ వైర్ పడింది. కొంచెంలో భయటపడ్డారు. మీ భార్య తాళి గట్టిదైయుట్టుంది సార్ అని అంటాడు. అప్పుడు కార్తీక్‌కు.. సౌందర్య, ప్రియమణి, పూజారి చెప్పిన గండం మాటలు గుర్తొస్తాయి. ఈ ఘటన చూసి కంగారు పడిన సౌందర్య.. చూడరా.. నువ్వే చూశావు కదా.. గండం అంటున్నారంటే కొట్టి పాడేశావ్.. ప్లీజ్ కార్తీక్ నా కోసం చెయ్యరా ఈ పూజ అంటూ కార్తీక్‌ను బతిమిలాడినా.. రాను, మోనిత పక్కను కూర్చోను అని కార్తీక్ ఒప్పుకోడు. మరో సీన్‌లో రాత్రి అయ్యాక కార్తీక్ దీపతో మాట్లాడటానికి చూస్తే.. దీప కోపంతో మాట్లాడుతుంది. సౌందర్య కార్తీక్‌కు తప్పిన ప్రమాదం గురించి మదనపడుతూ ఉంటుంది.
karthika deepam 4 nov Today Episode-2
మోనితను రమ్మని పిలువాలని అనుకుంటుంది. జైల్లో తన అన్న మాటలు గుర్తు తెచ్చకుని వస్తుందో రాదో అని అనుమానిస్తుంది. భారతికి కాల్ చేసి మోనిత రమ్మని చెబుతానని అనుకుంటుంది. సౌందర్య భారతికి కాల్ చేసి రప్పిస్తుంది. వారిద్దరూ మాట్లాడుకుంటుంటే దీప పై నుంచి చూసేస్తుంది. అయితే,వారి మాటలు దీపకు అర్థం కావు. శాంతి పూజలు అంటుంది. భారతీకి ఏం సంబంధం అని దీప ఆలోచిస్తుంటుంది. భారతీ మోనిత గురించి నీకే బాగా తెలుసు.
ఈ విషయం నువ్వే చూసుకోవాలని అని సౌందర్య చెప్పగా.. సరే ఆంటీ అని భారతీ వెళ్లిపోతుంది. సౌందర్య వెనక్కి చూడగా.. అక్కడ దీప ఉంటుంది. దీప ఏం మాట్లాడకుండా పక్కకు తప్పుకుంటుంది. మోనిత ఇంటికి ప్రియమణి వెళ్తుంది. ప్రియమణి మనకు ఇక మంచి రోజులు వచ్చేశాయి. అంతా శుభాలే. మనం కార్తీక్ కుటుంబాన్ని కీలు బొమ్మల్లా ఆడించబోతున్నాం. మనం ఏది చెబితే అది చెయ్యబోతున్నారు అంటూ మోనిత సంతోషపడుతూ ఈ విషయాన్ని ప్రియమణికి చెబుతుంది. సీన్ కట్ చేస్తే.. శాంతి పూజకు కార్తీక్‌ను ఒప్పించాలని సౌందర్య ట్రై చేస్తోంది. అప్పుడే దీప ఎంట్రీ ఇచ్చి శాంతి పూజ ఏంటి అత్తయ్య అని అడుగుతుంది.