karthika deepam Dec 4 Episode : డాక్టర్ బాబును హంతకుడిని చేసిన మోనిత.. నర్సు జయంతితో కలిసి మరో కుట్రకు తెర..!

karthika deepam Dec 4 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. బారసాల టైంలో జరిగిన అవమానంతో పాటు, డాక్టర్ మీటింగ్‌లో కూడా భరించని అవమాన భారంతో ఉన్న మోనిత ఈసారి కార్తీక్ జీవితాన్ని అంధకారం చేసేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఏకంగా కార్తీక్‌తో చేతులతో మర్డర్ చేయించేలా స్కెచ్ వేసింది. శనివారం 1214వ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక దీపం సీరియల్ హైలెట్స్ […].

By: jyothi

Updated On - Sat - 4 December 21

karthika deepam Dec 4 Episode : డాక్టర్ బాబును హంతకుడిని చేసిన మోనిత.. నర్సు జయంతితో కలిసి మరో కుట్రకు తెర..!

karthika deepam Dec 4 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. బారసాల టైంలో జరిగిన అవమానంతో పాటు, డాక్టర్ మీటింగ్‌లో కూడా భరించని అవమాన భారంతో ఉన్న మోనిత ఈసారి కార్తీక్ జీవితాన్ని అంధకారం చేసేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఏకంగా కార్తీక్‌తో చేతులతో మర్డర్ చేయించేలా స్కెచ్ వేసింది. శనివారం 1214వ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక దీపం సీరియల్ హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం..


ఓ పేషంట్‌కు గుండె ఆపరేషన్ చేసేందుకు కార్తీక్ సిద్ధమవుతాడు. థియేటర్‌లోకి వెళ్లాక కార్తీక్‌కు కళ్లు తిరుగుతుంటాయి. పక్కనే ఉన్న డాక్టర్ రవి ఏం చేస్తున్నావ్ కార్తీక్.. తప్పు చేస్తున్నావు అని అరుస్తున్నా అవేవి డాక్టర్ బాబుకు వినిపించవు. ఇంతలో రవి కార్తీక్‌ను అలర్ట్ చేసి షేషెంట్ చనిపోయాడు అని చెప్పడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.


రోగిని చంపేసావ్ కార్తీక్..

డాక్టర్ బాబు పూర్తిగా మత్తునుంచి తేరుకోకముందే ‘చంపేసావ్ కార్తీక్’ అని రవి అంటాడు. దీనికి ఎవరిది బాధ్యత అని కంగారు పడుతూనే డాక్టర్ బాబును నిలదీస్తాడు రవి.. సీన్ కట్ చేస్తే ప్రియమణి మోనిత కాఫీ ఇచ్చి చీవాట్లు పెడుతుంటుంది. మీకు అంత అవమానం జరిగినా ఇలా కాఫీ తాగుతూ కూర్చుంటే ఏం రీవెంజ్ తీసుకుంటారని అంటుంది. ఇంతలో మోనిత సెల్‌కు జయంతి నుంచి డన్ అని మెసేజ్ వస్తుంది. మోనిత కేకలు పెడుతూ మీ కార్తీకయ్య పని అయిపోయిందని చెప్పడంతో ప్రియమణికి ఏం అర్థం కాదు.

karthika deepam Dec 4 Episode

karthika deepam Dec 4 Episode

నర్సు జయంతితో కొత్త కుట్రకు తెర..

డాక్టర్ బాబు హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సు జయంతిని మోనిత కొనేసింది. డాక్టర్ బాబు గుండె ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాడని తెలిసి ముందే కాఫీలో నిద్రమాత్రలు కలిపి ఇస్తుంది జయంతి. అది తెలియక కార్తీక్ కాఫీ తాగి వెళ్ళి మత్తులో ఆపరేషన్ చేస్తాడు. రోగి చనిపోవడంతో ఇప్పుడు కార్తీక్ పని అయిపోయిందంటూ మోనిత తెగ సంబుర పడుతుంది. గతంలో కూడా రత్నసీత, సోడా సుకన్యా, ప్రస్తుతం జయంతిలను వాడుకుని మోనిత కొత్త కుట్రలకు తెరలేపింది.


ఇక తన భర్త చనిపోయాడు అని తెలియడంతో రోగి భార్య కార్తీక్ కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీస్తుంది.నేను నా పిల్లలు ఎలా బతకాలి అప్పులు ఎలా కట్టుకోవాలంటూ రోధిస్తుంది. కార్తీక్ మాత్రం తల కిందకు దించుకుని అలా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లేసరికి పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకుంటుంటారు.. కార్తీక్ మాత్రం మౌనంగా లోనికి వెళ్తాడు.. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.

Tags

Latest News

Related News